Home /News /trending /

GROOM SUDDENLY GETS EMOTIONAL WHILE SITTING BESIDE HIS BRIDE IN MANDAP VIDEO GOES VIRAL PAH

Viral Video:పెళ్లి పీటల మీద కాబోయే భర్తతో కన్నీళ్లు పెట్టించిన యువతి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

కన్నీళ్లు పెట్టుకుంటున్న వరుడు..

కన్నీళ్లు పెట్టుకుంటున్న వరుడు..

Viral Video: పెళ్లి వేడుకకు సంబంధించిన కంటెంట్ కు సోషల్ మీడియాలో కొదువే లేదని చెప్పుకొవచ్చు. అనేక ఫన్నీ సంఘటనలు, ఎమోషనల్ పెళ్లి వీడియోలు వైరల్ అవుతునే ఉన్నాయి. తాజాగా, మరో పెళ్లి వేడుక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Bride and Groom Get Emotional: పెళ్లి వేడుకకు సంబంధించి ఎన్ని వీడియోలు వైరల్ అయినా.. వీటికున్న క్రేజ్ ఏమాత్రం తగ్గటం లేదు. నెటిజన్లు ఇలాంటి ఫన్నీ వీడియోలు, ఎమోషనల్ వీడియోలను చూడటానికి తెగ ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. వీటిని చూసి తమ పెళ్లి కూడా ఇలా జరగాలని కలలు కంటున్నారు. పెళ్లిని ప్రతి ఒక్కరు గ్రాండ్ గా చేసుకుంటారు. దీనికి బంధువులు, స్నేహితులు, వివిధ కార్యక్రమాలు , డీజేలు నానా హాంగామా ఉంటునే ఉంటాయి. కొన్ని చోట్ల వరమాల వేసుకునేటప్పులు.. కొత్త జంట ఒకరిపై మరొకరు చిరుకోపాలు చూపించుకున్న సంఘటనలు వైరల్ అయ్యాయి.

ఇక పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేల సంఖ్యలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో జరిగిన సరదా సన్నివేశాల వలన ఇవి వైరల్ అవుతున్నాయి. కొన్ని చోట్ల.. వీటిని పబ్లిసిటీ కోసమో.. మరేంటో కానీ పెళ్లిలో ఏదో ఒక ఫన్ క్రియేట్ చేసి మరీ వైరల్ చేస్తున్నారు. పెళ్ళిలో వధువు.. వేదికపై బుల్లెట్ బండీమీద, పల్లకిలో, క్రేన్ సహాయంతో వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన అనేక పెళ్లి వీడియోలు వైరల్ గా మారాయి. ఇక.. పెళ్లి మండపం మీద వరుడు.. వధువుకు ఇచ్చిన సర్ ప్రైజ్ లు, చేసిన అనేక చిలిపి పనులతో వారు వేదికమీద ఎమోషనల్ అయిన అనేక వీడియోలు వైరల్ అయ్యాయి.






పూర్తి వివరాలు.. ఈ వీడియోలో వేదికమీద వరుడు, వధువు కూర్చొని ఉన్నారు. బంధువులు, స్నేహితుల మధ్య పెళ్లి తంతు కొనసాగుతుంది. కొత్త జంట ఇద్దరు కూడా మంచి కాస్టూమ్ ధరించారు. ఈ క్రమంలో.. వరుడు,తనకు కాబోయే వధువు వంక చూశాడు. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. ఆమెను చూస్తు కళ్లలో నీళ్లను ఆపుకొలేక ఏడ్చేశాడు.

అతడిని చూసి వధువు కూడా ఎమోషనల్ అయ్యింది. ఇద్దరిని వారి బంధువులు ఓదార్చారు. ఆ తర్వాత .. వరుడిని  భార్య దగ్గర తీసుకుని బుజ్జగిచ్చింది. అతను ప్రేమతో ఆమెకు ముద్దు పెట్టాడు.ఈ సన్నివేశం చూసిన అక్కడి వారు కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడేమో.. ఆనందం తట్టుకోలేక ఏడుస్తున్నాడు..’, ‘ఇంతటి ఎమోషన్ ఉన్న యువకుడు భర్తగా దొరకడం లక్కీ..’ అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Viral Video, Wedding

తదుపరి వార్తలు