పెళ్లికి వెళ్లి అక్షితలు వేసి... విందు భోజనం తిని హాయిగా ఇళ్లకు వెళ్దామనుకున్న బంధువులు పొట్టపగిలేలా నవ్విన సందర్భం అది. అందరూ చూస్తుండగా... వధువును గట్టిగా ముద్దుపెట్టుకున్నాడు వరుడు. ఈ మధ్య పెళ్లిళ్లలో ఇలాంటి ముద్దుల గోల ఎక్కువైంది. మొన్నకు మొన్న తనకు కాబోయే బావకు... తన అక్క పక్కన ఉండగానే ముద్దు పెట్టింది చెల్లెలు. దాంతో... షాకవ్వడం అక్క వంతైంది. నిజానికి తాజా ఘటనలో వరుడి తప్పేమీ లేదు. అదో సంప్రదాయం. అందరూ చూస్తుండగా... వధువుకు ముద్దు పెట్టాలి. అది కూడా పెళ్లి జరుగుతున్నప్పుడే. ఇది ఒక రకంగా చూసేవాళ్లకే కాదు... వధూవరులకు కూడా ఇబ్బందికరమైన ఘటనే. కానీ ఆచారాలు పాటించకపోతే ఊరుకోరు కదా...
ఈ పెళ్లిలో వధూవరుల చుట్టూ చాలా మంది ఉన్నారు. వారిలో యంగ్ అమ్మాయిలు కూడా ఉన్నారు. ఆ ఘట్టం వచ్చింది. అందరూ ఏం చేస్తాడా అని చూస్తున్నారు. ఏమైనా కానీ అనుకున్న వరుడు వధువుకు గట్టిగా ముద్దు పెట్టాడు. మరీ అంత గట్టిగా ముద్దు పెట్టాలా... నీ తొందరా నువ్వూ... అంటూ అందరూ పగలబడి నవ్వారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇలాంటి కల్చర్స్ కూడా మన దేశంలో ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.
ఆ వీడియో ఇక్కడ చూడండి.
View this post on Instagram
ఇది కూడా చదవండి: Video: పెళ్లిలో దెయ్యంలా కనిపించిన వధువు... పారిపోయిన వరుడు
ముద్దు సీన్ తర్వాత వధూవరులు సిగ్గుల మొగ్గలవ్వడం వీడియోలో మనం చూడొచ్చు. నెటిజన్లలో చాలా మంది ఆశ్చర్యపోతూ నవ్విన ఇమోజీలను తమ కామెంట్లలో పెట్టారు. కొద్దరు చప్పట్లు కొట్టినవి పెట్టారు. ఇలాంటి కల్చర్ భలే ఉందే అంటున్నారు. ఐతే, ఈ పెళ్లి ఎక్కడ జరిగింది, ఈ ఆచారం ఎలా వచ్చిందనేది మాత్రం వీడియో దగ్గర వివరాలు లేవు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Viral, VIRAL NEWS, Viral Video, Viral Videos