GROOM GETTING MARRIED ON A BULLDOZER IN UTTAR PRADESH VIDEO GOING VIRAL SNR
Video Viral : పెళ్లి కొడుకు వెరైటీ కోరిక .. అమ్మాయి ఇంటికి ఎలా వెళ్లాడో ఈ వీడియో చూడండి
(Photo Credit:Youtube)
Video Viral: క్రేజ్ కోసం క్రియేటివిటీ ప్రదర్శిస్తున్నారు. అన్నీ విషయాల్లో ఏమో కాని పెళ్లి విషయంలో కూడా కొందరు వింత పోకడలు, విచిత్రమైన కోర్కెలను తీర్చుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి కొడుకు వివాహానికి జేసీబీని పెళ్లి వాహనంగా మార్చుకొని దానిపై వచ్చాడు. ఇప్పుడు ఈ వీడియోనే విపరీతంగా వైరల్ అవుతోంది.
చాలా చోట్ల పెళ్లిళ్లు విచిత్రమైన పద్ధతుల్లో జరుగుతూ ఉంటాయి. మరికొన్ని చోట్ల నూతన వధువరులు వింత ఆచారంలో పెళ్లి చేసుకోవడం చూస్తూ ఉంటాం. కాని ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఓ పెళ్లి కుమారుడికి వచ్చిన ఐడియా(Idea) చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎవరైనా పెళ్లి కొడుకు (Groom)వివాహం చేసుకొని..పెళ్లి కూతుర్ని తీసుకెళ్లడానికి కారు, జీపు, లేదంటే ఏనుగు, ఇంకా కాదంటే గుర్రం, అది లేదంటే బైక్, సైకిల్‌పై వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాని ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఓ పెళ్లి కొడుకు వెరైటీగా ఆలోచించి బుల్డోజర్(Bulldozer)అంటే జేసీబీ(JCB)ని తన వాహనంగా మార్చుకున్నాడు. అదే బుల్డోజర్పై వివాహం జరుగుతున్న వేదిక అనగా వధువు ఇంటికి చేరుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో(Video)నే సామాజిక మాధ్యమాల్లో(Social media) విపరీతంగా వైరల్(Viral)అవుతోంది.
పెళ్లి కొడుకు సరదా ..
నవ్విపోదురుగా నాకేంటంటా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలోని రిసియా ప్రాంతంలో శనివారం ఓ వివాహం జరిగింది. పెళ్లి కుమార్తెది అదే ప్రాంతం కావడంతో పెళ్లి కొడుకు వివాహం చేసుకోవడానికి సొంత ఊరి నుంచి ఏకంగా బుల్డోజర్(జేసీబీ)పై ఊరేగింపుగా వచ్చాడు. పెళ్లి కొడుకు ఊరేగింపు వాహనం కావడంతో జేసీబీని అందంగా పూలతో డెకరేషన్ చేశారు. జేసీబీ ముందు భాగంలో ఓ చెక్కను వేసి దానిపై బెడ్ షిట్ కప్పారు. అక్కడ పెళ్లి కుమారుడు కూర్చునేందుకు వీలుగా జేసీబీ ముందు భాగాన్ని మార్చేశారు. కూల్చేందుకు వీలుగా ఉండే ఇనుప పరికరాన్ని కనిపించకుండా ఓ బెడ్షిట్తో దాన్ని మూసివేశారు.
అట్లా కూడా వెళ్తారా ..
దర్జాగా పెళ్లి దుస్తుల్లో రెడీ అయిన పెళ్లి కుమారుడు బుల్డోజర్పై కూర్చొని కాసేపు...నిల్చొని కాసేపు ఊరేగింపుగా అత్త,మామల ఇంటికి చేరుకున్నాడు. పెళ్లి కొడుకు వివాహ వేదికకు చేరుకోవడానికి వస్తుంటే అతని స్నేహితులు, బంధువులు బుల్డోజర్ (జేసీబీ) ముందు డ్యాన్స్‌లు చేస్తూ వచ్చారు. పెళ్లి కొడుకు బుల్డోజర్పై వస్తుంటే విచిత్రంగా చూస్తున్న రిసియా గ్రామస్తులు బుల్డోజర్ బాబాకి జై అంటూ నినాదాలు చేశారు. పెళ్లి సంగతి, పెళ్లి భోజనాల సంగతి కంటే ..పెళ్లి కొడుకు బుల్డోజర్పై ఊరేగింపుగా రావడంతో వార్త వైరల్ అయింది. గ్రామస్తులు ఈ తరహా విచిత్రాన్ని తమ సెల్ఫోన్లలో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు కూడా వింతగా కామెంట్స్‌ని పోస్ట్ చేస్తున్నారు. గతంలో విచిత్రంగా పెళ్లి జరిగినా, పెళ్లి కుమారుడు బాగోలేకపోయినా ఇదేం పెళ్లి..వీడేం పెళ్లి కొడుకు అనే వాళ్లు...కాని ఇప్పుడు మాత్రం ఇదేం పెళ్లి వాహనం అని ఆశ్చర్యపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.