Home /News /trending /

GROOM FAILS TO ARRIVE ON TIME BRIDE MARRIES ANOTHER MAN PVN

Intresting : ముహుర్త సమయానికి పెళ్లి మండపానికి చేరుకోని వరుడు..మరొకరినిపెళ్లి చేసుకున్న వధువు

ఆలస్యంగా వచ్చిన వరుడు..మరొకరిని పెళ్లి చేసుకున్న వధువు

ఆలస్యంగా వచ్చిన వరుడు..మరొకరిని పెళ్లి చేసుకున్న వధువు

Bride Marries Another Man : కొంతకాలంగా పెళ్లిళ్లలో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. అసలు పెళ్లి మండపానికి వరుడు,వధువు చేరుకునేలోపే చాలా జరిగిపోతున్నాయి. నూరేళ్లు కలిసి ఉండాలని కన్న కలలన్నీ క్షణాల్లో కలలుగానే మిగిలిపోతున్నాయి.

Bride Marries Another Man : కొంతకాలంగా పెళ్లిళ్లలో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. అసలు పెళ్లి మండపానికి వరుడు,వధువు చేరుకునేలోపే చాలా జరిగిపోతున్నాయి. నూరేళ్లు కలిసి ఉండాలని కన్న కలలన్నీ క్షణాల్లో కలలుగానే మిగిలిపోతున్నాయి. అయితే తాజాగా పెళ్లి మండపానికి వరుడు ఆలస్యంగా వచ్చాడన్నా కారణంగా అతడితో వివాహానికి నిరాకరించిన వధువు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మహారాష్ట్ర(Maharashtra) రాష్ట్రంలోని బుల్దానా జిల్లాలోని మల్కాపూర్‌ పాంగ్రా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

 బుల్దానా జిల్లాలోని కండారీ గ్రామానికి చెందిన యువకుడితో మల్కాపూర్‌ పాంగ్రా గ్రామానికి చెందిన యువతికి వివాహం(Marriage) కుదిరింది. మల్కాపూర్ పాంగ్రా గ్రామంలో ఈ నెల 22న ఒక జంటకు పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు పెళ్లి ముహూర్తం. పెళ్లి మండపానికి అతిథులు చేరుకున్నారు. కానీ వరుడు మాత్రం ఆ సమయానికి పెళ్లి మండపానికి చేరుకోలేదు. పెళ్లి కుమారుడి కోసం పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, బంధువులు వేచి చూస్తున్నారు. అయితే వరుడు మాత్రం ఫుల్ గా మద్యం సేవించి బంధువులు, స్నేహితులతో కలిసి డ్యాన్సులు వేశాడు. మధ్యాహ్నానికే మల్కాపూర్‌ పాంగ్రా గ్రామానికి చేరుకున్న వరుడు బారాత్ ముగించుకొని పెళ్లి మండపానికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలయింది.

ALSO READ Viral Video : మహాతల్లి..కళ్ల ముందు ఇల్లు తగలబడుతున్నా హాయిగా ఊయల ఊగుతోంది

ముహూర్తం దాటిన తర్వాత వచ్చిన వరుడి తీరుపై వధువు తండ్రి ఆగ్రహం చెందాడు. ఎందుకు ఇంత ఆలస్యం జరిగిందంటూ వరుడి తరఫు వారిని వధువు తరఫు వారు ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. అయితే కొద్దిసేపటికే ఈ గొడవ ఓ కొలిక్కి వచ్చింది. కానీ, ఆ తర్వాత వధువు తాను ఈ పెళ్లి చేసుకోలేనంటూ తన తండ్రికి తేల్చిచెప్పింది. పెళ్లికి ముందే ఇలా ఉంటే..పెళ్లి అయిన తర్వాత తన పరిస్థితి ఎలా ఉంటదో అని భయపడిన వధువు..అతడితో పెళ్లి వద్దంటే వద్దు అని తండ్రికి తెగేసి చెప్పింది. దీంతో కూతురు నిర్ణయాన్ని తండ్రి గౌరవించాడు. వరుడు కుటుంబసభ్యులకు విషయం చెప్పాడు. దీంతో వరుడు పెళ్లి చేసుకోకుండానే వెళ్లిపోయాడు. అయితే ఆ మరుసటి రోజే వధువు తండ్రి..పెళ్లికి వచ్చిన ఒక బంధువుతో మాట్లాడి అతడి కుమారుడితో తన కుమార్తెకు పెళ్లి చేశాడు. వరుడి తరుఫు వారు ముహూర్తానికి పెళ్లి వేదిక వద్దకు రాలేదని, డ్యాన్సుల్లో వారు బిజీగా ఉన్నారని ఆయన ఆరోపించాడు. అందుకే బంధువు కుమారుడితో తన కుమార్తెకు పెళ్లి జరిపించినట్లు చెప్పాడు. అయితే ఈ పెళ్లి జరిగిన తర్వాత కండారీ నుంచి మల్కాపూర్ పాంగ్రా గ్రామానికి వచ్చిన పెద్దలు ఈ పెళ్లి ఎలా చేస్తారని అమ్మాయి తరఫు వారిని నిలదీశారు. ఆగిపోయిన పెళ్లి కుమారుడి తరఫున అమ్మాయికి ఇచ్చిన ఆభరణాలు, చీరలు వెనక్కి ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత మరో అమ్మాయితో ఆ వరుడి వివాహం కూడా జరిగింది
Published by:Venkaiah Naidu
First published:

Tags: Arrange marriage, Maharashtra

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు