True love-Video Viral: కల్మషం లేని ప్రేమ అంటే ఇదేనేమో.. వీడియో వైరల్..

దంపతులు

True love: వృద్ధాప్యంలో ఉన్న భార్యాభర్తల మధ్య ప్రేమను చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అంతలా ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. ఆ వీడియోను మీరు కూడా చేసేయండి.

 • Share this:
  ప్రేమ(Love) అంటే తెలియని వాళ్లు ఉండరు. ప్రస్తుతం జనరేషన్(Generation) లో చాలామంది అమ్మాయిలను ప్రేమ పేరుతో వేధించి దక్కకపోతే హత్యలు, అత్యాచారాలు చేస్తుండటం మనం చూస్తున్నాం. వాళ్లు దానిని ప్రేమే అనుకోవడమే అతి పెద్ద తప్పు. ఎందుకంటే అది ప్రేమ కాదు.. అది ఎట్రాక్షన్ మాత్రమే. వయస్సులో ఉన్నప్పుడు ఇలాంటి ఎట్రాక్షన్ లు అనేవి యువకుడిపై యువతికి.. యువతిపై యువకుడికి రావడం సహజం. కానీ అదే ప్రేమ అని అనుకోవడం కరెక్ట్ కాదు. అయితే ప్రేమ అనేది.. తల్లిదండ్రుల మధ్య, భార్యభర్తల మధ్య, స్నేహితుల మధ్య , సోదరీసోదరుల మధ్య ఉండేది.

  Hyderabad News: ఊదమంటే.. దాన్నిపట్టుకొని ఉడాయించాడు.. ఏం జరిగిందంటే..


  ఇలా ఏ బంధం తీసుకున్నా దానికి మూలాధారం ప్రేమే. ఆ ప్రేమే మనుషుల్ని ఏకం చేసేది.. ఆ ప్రేమే మనుషుల్ని నడిపించేది... ఆ ప్రేమే మనుషుల్ని బ్రతికించేది. కానీ దానిని పరిశీలనగా చూస్తే దాని వెనకాల కూడా స్వార్ధం, లాభం, మోసం లాంటివి కనిపిస్తాయి. అయితే ఈ రోజుల్లో మనిషి ఆశించేది స్వచ్ఛమైన ప్రేమ. మనిషి కోరుకునేది నిజమైన ప్రేమ. కానీ మనిషికి అది దొరకట్లేదు. వస్తువుల్లో లేక పదార్థాల్లో కల్తీ ఉన్నట్లుగా ఈరోజు మనుషుల ప్రేమల్లో కుడా కల్తీ ఉండడం చూస్తున్నాం. ప్రేమించాను అని చెప్తూనే వంచించే వారు ఎందరో ఉన్నారు.
  Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి


  పోస్ట్ @kethamma__avva ద్వారా భాగస్వామ్యం చేయబడింది

  అయితే ఇక్కడ ఒక వీడియోలో మనకు స్వచ్చమైన ప్రేమ కనిపిస్తుంది. ఎలాంటి కల్మషం లేకుండా వారి మధ్య ప్రేమ కురిసింది. ఇతకు ఆ వీడియో ఏంటి.. అసలు కథేంటి చూద్దాం.. ఒక తాత చేతిలో కర్రపట్టుకొని పెరట్లోని ఇంటి గుమ్మం ముందు కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. అతడి పక్కనే తన భార్య కూడా ఉంది. ఏమి ఆలోచిస్తున్నావండి అంటూ అడిగింది. అతడు కొద్దిసేపు ఏదో విషయమై చర్చింకున్నారు. తర్వాత అతడు కొంత భావోద్వేగానికి గురయ్యాడు. దీంతో భామ చేసిన పనితో అతడికున్న ఆ ఒత్తిడి.. సమస్య మటు మాయం అయిపోయింది.

  ఛీ చీ.. నువ్వసలు ఉపాధ్యాయుడివేనా.. విద్యాబుద్ధులు నేర్పించాల్సింది పోయి.. 12 ఏళ్ల విద్యార్థినితో ఏంటి ఆ పని..


  ఆమె తన భర్త బుగ్గపై ముద్దు పెట్టింది. దీంతో ఇద్దరు సిగ్గుతో నవ్వుకుంటూ ఉంటారు. ఈ వీడియోను అక్కడ ఉన్న ఓ వ్యక్తి తీశాడు. దీంతో ఆ వీడియో తెగ వైరల్ గా మారింది. దీనిని ఇన్ స్టాగ్రామ్ లో కథమ్మ అవ్వా అనే మహిళ పోస్టు చేసింది. ఈ వీడియో చూసిన వారికి మనస్సు ఎంతో కదిలించింది. కథమా వీడియోని షేర్ చేసి,‘‘Ayoo siguu’’ అంటూ ట్యాగ్ చేసి వీడియో షేర్ చేశారు. ఈ వయస్సులో కూడా వాళ్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి నెటిజన్లు ఎంతో మురిసిపోయారు.

  Army Song: జవాన్ల కోసం సరికొత్త పాట.. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసేలా ట్యూన్​..


  ఇప్పటికే 82 లక్షల మంది నెటిజన్లు వీడియోను వీక్షించారు. తాత, భామ మధ్య ప్రేమను చూసి నెటిజన్లు కూడా వారిని ప్రేమతో కామెంట్ బాక్సుల్లో నింపేశారు. ‘నిజమైన ప్రేమకు వయస్సు లేదు.. నిజమైన ప్రేమ ఎన్నటికీ మసకబారదు’ అంటూ కామెంట్లు చేశారు.
  Published by:Veera Babu
  First published: