హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Post A Picture Challenge: ఆ ఫోటో షేర్ చేసి లక్ష మంది అభిమానులను కోల్పోయిన గాయని

Post A Picture Challenge: ఆ ఫోటో షేర్ చేసి లక్ష మంది అభిమానులను కోల్పోయిన గాయని

image credits instagram

image credits instagram

billie Eilish Lock screen: ఇద్దరు మహిళలు నగ్నంగా ఒకరికింద ఒకరు నిలుచుని ఉన్న వాటర్ పేయింటింగ్ ఫోటో అది. అంతేగాక మరో యూజర్.. ఆమె గర్వించదగిన ఒక కళాకృతిని పంచుకోవాలని బిల్లిని కోరాడు. దానికి బదులుగా ఆమె తన...

 • News18
 • Last Updated :

  ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తున్న చాలెంజ్ లు వెర్రి వేయి తలలు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక విదేశాలలో అయితే ఇవి మరీ హద్దులు మీరుతున్నాయి. కొన్ని చాలెంజ్ లు మనుషుల ప్రాణాలు తీస్తే.. మరికొన్ని సమాజంలో సెలబ్రిటీల పరువు తీస్తున్నాయి. ఇటువంటి చాలెంజే ఇప్పుడు గ్రామీ అవార్డు (grammy award singer) గాయని బిల్లి ఐలిష్ (billie Eilish) పరువు తీసింది. అంతేకాదు.. ఈ చాలెంజ్ ను అంగీకరించి ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా లక్ష మంది ఫాలోవర్లను కోల్పోయింది బ్యూటీ. బిల్లిని అన్ ఫాలో చేస్తున్న వారి సంఖ్య ఇంకా పెరుగుతుండటం గమనార్హం. ఇంతకీ ఈమె ఏం చాలెంజ్ లో పాల్గొంది..? అభిమానుల ఆగ్రహానికి కారణాలేమిటి..?

  ప్రముఖ గాయని, గ్రామీ అవార్డు విన్నర్ బిల్లి Instagram లో తనకు పలువురు విసిరిన ‘పోస్ట్ ఎ పిక్చర్ ఆఫ్’ సవాల్ ను స్వీకరించింది. దీంతో ఒక యూజర్.. బిల్లీ ఫోన్ వాల్ పేపర్ ఫోటోను షేర్ చేయాలని చాలెంజ్ విసిరాడు. దీంతో ఆమె తన మొబైల్ లాక్ స్క్రీన్ స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది. ఇదే ఆమెకు ముప్పును తీసుకొచ్చింది.


  ఆ ఫోటోలో.. ఇద్దరు మహిళలు నగ్నంగా ఒకరికింద ఒకరు నిలుచుని ఉన్న వాటర్ పేయింటింగ్ ఫోటో అది. అంతేగాక మరో యూజర్.. ఆమె గర్వించదగిన ఒక కళాకృతిని పంచుకోవాలని బిల్లిని కోరాడు.


  View this post on Instagram


  A post shared by Etta F (@sneezeandpepsi)  దానికి బదులుగా ఆమె గీసిన డ్రాయింగ్ ను పంచుకుంది. ఇందులో మహిళల వక్షోజాలు ఉన్నాయి. ఆమె ఫోటోతో పాటు.. ‘lol I love b**bs’ అని రాసుకొచ్చింది.


  బిల్లీ ఈ ఫోటోలను పోస్ట్ చేసిన తర్వాత.. ఆమె అభిమానుల నుంచి ఊహించని ఆగ్రహం చవిచూసింది. ఇదో పనికి మాలిన పోస్టు అని పలువురు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. కొంతమంది ఆ ఫోటోలకు డిస్లైక్ లు కొట్టి.. ఆమెను Unfallow అయ్యారు. కొద్ది గంటల వ్యవధి లోనే ఆమె ఇన్స్టాగ్రాంలో దాదాపు ఒక లక్ష మంది ఫాలోవర్లను కోల్పోవడం గమనార్హం.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Instagram, Social Media, Trending, Viral, VIRAL NEWS

  ఉత్తమ కథలు