పీవోకే జమ్మూ కాశ్మీర్‌లో లేదు.. అసలు ఇండియా మ్యాప్ ఇదీ..

పీవోకే జమ్మూకాశ్మీర్‌లోనే ఉంటుందని అంతా భావించారు. కానీ, దాన్ని లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో చేర్చుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. లడఖ్‌లో కార్గిల్, లేహ్ జిల్లాలు ఉండనున్నాయి.

news18-telugu
Updated: November 2, 2019, 7:49 PM IST
పీవోకే జమ్మూ కాశ్మీర్‌లో లేదు.. అసలు ఇండియా మ్యాప్ ఇదీ..
కేంద్రం విడుదల చేసిన పటం
  • Share this:
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చుతూనే.. అందులోని లడఖ్ ప్రాంతాన్ని మరో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ సర్కార్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడంతో దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆ నిర్ణయం ఫలితంగా దేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. అయితే.. పీవోకే జమ్మూకాశ్మీర్‌లోనే ఉంటుందని అంతా భావించారు. కానీ, దాన్ని లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో చేర్చుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. లడఖ్‌లో కార్గిల్, లేహ్ జిల్లాలు ఉండనున్నాయి. అదే.. జమ్మూ కాశ్మీర్‌లో 20 జిల్లాలు ఉండనున్నాయి. ఇప్పటి వరకు 29 రాష్ట్రాలను కలిగిన భారత దేశం అక్టోబరు 31 నుంచి 28 రాష్ట్రాల దేశంగా మారింది. మరోవైపు, చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్‌చిన్‌ను కూడా లడఖ్‌లో చేర్చడం విశేషం.
భారతదేశ పొలిటికల్ మ్యాప్

2014 కు అంతకుముందు కూడా 28 రాష్ట్రాలు ఉండగా, తెలంగాణ అవతరించడంతో రాష్ట్రాల సంఖ్య 29కి చేరుకుంది. తాజాగా, జమ్మూ కాశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లదాఖ్‌ను అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన సంగతి తెలిసిందే.First published: November 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>