Home /News /trending /

GOVT EASES NORMS FOR CHANGE OF ADDRESS ON AADHAAR MOVE AIMED AT HELPING MIGRANT WORKERS BS

Aadhaar : ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఇక ఈజీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Aadhaar : ఆధార్ కార్డులో చిరునామాను ఈజీగా మార్చుకునే వెసులుబాటును కల్పించింది. ఊరు మారినా.. ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకునేందుకు సదరు వ్యక్తి.. స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని(Self Declaration) సమర్పిస్తే చాలు.

    పొట్ట కూటి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే వారికి శుభవార్త. సొంతూరులో ఉన్న ఆధార్ కార్డు.. పనిచేసే చోట పనిచేయక ఉద్యోగులు, వలస వెళ్లేవాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే అందులో ఉండే చిరునామా వల్లే సమస్యంతా. ఈ సమస్యకు చెక్ పెట్టింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ. ఆధార్ కార్డులో చిరునామాను ఈజీగా మార్చుకునే వెసులుబాటును కల్పించింది. ఊరు మారినా.. ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకునేందుకు సదరు వ్యక్తి.. స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని(Self Declaration) సమర్పిస్తే చాలు. ఈ మేరకు ఆధార్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనివల్ల ఆధార్‌ కార్డులో స్వస్థల చిరునామా ఉండి వలస వెళ్లిన ఉద్యోగులు, కార్మికులకు ప్రయోజనం కలుగనుంది. ఈ సడలింపుతో బ్యాంకు ఖాతా తెరవడానికి, ఆర్థిక లావాదేవీలకు ఉపయోగపడుతుంది. ప్రస్తుత అడ్రస్ స్థానంలో వర్క్ అడ్రస్ ఇవ్వడానికి ఆధార్ అవకాశం కల్పించింది.
    First published:

    Tags: Aadhaar, Aadhaar card, AADHAR, Ration card, UIDAI

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు