Home /News /trending /

GOVERNMENT SCHOOL TEACHER IN UTTAR PRADESH DOING MASSAGE WITH STUDENTS IN THE CLASSROOM VIDEO HAS GONE VIRAL SNR

Video viral: క్లాస్‌ రూమ్‌లో స్టూడెంట్‌తో మసాజ్ చేయించుకున్న లేడీ టీచర్ ..వీడియో ఇదిగో

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Video Viral: ఎక్కడైనా స్కూల్‌లో టీచర్లు స్టూడెంట్స్‌కి పాఠాలు చెబుతారు. నాలుగు మంచి పనులు నేర్పిస్తారు. కాని ఉత్తరప్రదేశ్‌లోని ఓ గవర్నమెంట్‌ స్కూల్‌లో లేడీ టీచర్ స్టూడెంట్‌తో క్లాస్‌ రూమ్‌లో వెలగబెట్టిన ఘనకార్యానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు(Teacher)..వారితో పరిచారికలు చేయించుకుంది. పవిత్రమైన విద్యాలయంలో నిస్సిగ్గుగా పసిపిల్లలతో మసాజ్ చేయించుకుంటూ మధ్యలో వాళ్లను బెదిరించింది. కుర్చీలోంచి లేవకుండా ఓ పెదేళ్ల వయసు కలిగిన స్టూడెంట్స్‌(Students)తో ఉపాధ్యాయురాలు వెలగబెట్టిన ఘనకార్యం స్కూల్‌ సిబ్బంది సెల్‌ఫోన్‌(Cell phone)లో షూట్ చేసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేయడంతో విషయం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు విపరీతంగా వైరల్(Viral)అవుతోంది. టీచర్ ఉద్యోగానికి ఎసరపెట్టింది.

పిల్లలతో మసాజ్ ఏంటీ..
నేటి బాలల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉన్నతమైన, గౌరప్రదమైన ఉద్యోగం చేస్తున్న ఓ లేడీ టీచర్‌ పదేళ్ల స్టూడెంట్‌తో చేతుల నొక్కించుకోవడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. హర్దోయ్ జిల్లాలోని వికాస్ఖండ్ బవాన్‌లోని పోఖారీ అనే ప్రాథమిక పాఠశాలలో ఊర్మిళా సింగ్‌ అనే ఉపాధ్యాయురాలు అసిస్టెంట్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. క్లాస్‌ రూమ్‌కి పాఠాలు చెప్పేందుకు వచ్చిన టీచర్..ఎంతో సరదాగా..దర్జాగా కుర్చిలో కూర్చొని చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని ...విద్యార్ధితో తన చేతులు నొక్కించుకుంది.

వీడియో వైరల్ ..
మిగిలిన విద్యార్ధులు తరగతి గదిలో అల్లరి చేస్తుంటే వాళ్లను అల్లరి చేయవద్దని భయపెడుతూనే స్టూడెంట్‌తో హ్యాండ్ మసాజ్ చేయించుకుంది టీచర్‌. ఒక ఉపాధ్యాయురాలు క్లాస్‌రూమ్‌ని విశ్రాంతి గదిగా మార్చుకొని తాను వెలగబెడుతున్న ఘనకార్యం చూసిన స్కూల్‌ సిబ్బందిలో ఒకరు ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో అమ్మగారి బాగోతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Voter Card: 17 ఏళ్లకే ఓటర్‌ కార్డుకు దరఖాస్తు చేయొచ్చు.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన



చర్యలు తీసుకోండి..
ఈ సంఘటనే కాదు గతంలో కూడా ఊర్మిళాసింగ్ స్టూడెంట్స్‌ని బెదిరించి తన కాళ్లు, చేతులు నొక్కించుకునేదనే విమర్శలు ఉన్నాయి. క్లాస్‌ రూమ్‌లో వాటర్ బాటిల్‌ చేతిలో పట్టుకొని చేస్తున్నఅరాచకంపై నెటిజన్లు మండిపడుతున్నారు.దీనిపై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు సైతం స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తమకు తెలిసిందని ..పిల్లలతో చేతులు, కాళ్లు నొక్కించుకున్న టీచర్ ఉర్మిళ సింగ్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని...చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Uttar pradesh, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు