లీడర్ అంటే ఇలా ఉండాలి... నాయకత్వ పాఠాలు నేర్పుతున్న గొరిల్లా...

Gorilla Lessons : గొరిల్లాలు మనుషుల లాంటివే. మనలాగే ఆలోచిస్తాయి. మనలాగే ప్రవర్తిస్తాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో.

news18-telugu
Updated: February 15, 2020, 8:38 AM IST
లీడర్ అంటే ఇలా ఉండాలి... నాయకత్వ పాఠాలు నేర్పుతున్న గొరిల్లా...
లీడర్ అంటే ఇలా ఉండాలి... నాయకత్వ పాఠాలు నేర్పుతున్న గొరిల్లా... (credit - twitter - Susanta Nanda IFS)
  • Share this:
Gorilla Lessons : గొరిల్లాలలో రకాలుంటాయి. ఆ గుంపులో పెద్దదైన గొరిల్లా మగది అయి ఉంటుంది. జుట్టు కాస్త నెరిసిపోయి ఉంటుంది. అలాంటి గొరిల్లా... నాయకుడిగా ఎదగడమే కాదు... మిగతా గొరిల్లాలను చక్కటి మార్గంలో నడిపిస్తుంది. అలాంటి ఓ గొరిల్లాను ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటూ... ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ఈ వీడియోని మనకు చూపిస్తున్నారు. ఇందులో పెద్ద గొరిలా (నాయకుడు)... ముందుగా రోడ్డుపైకి వచ్చి... అటుగా వాహనాలు, మనుషులూ ఎవరూ రావట్లేదని తెలుసుకొని... అప్పుడు మిగతా గొరిల్లాలను రోడ్డు దాటించింది. ఆ చిన్న గొరిల్లాలు రోడ్డు దాటుతున్నంతసేపూ... పెద్ద గొరిల్లా నిఠారుగా ఉండి... వాటిలో ధైర్యం నింపింది. అందుకే... లీడర్ అంటే ఇలా ఉండాలి అంటూ కాప్షన్ పెట్టారు సుశాంత నందా.


గొరిల్లాలలో నాయక గొరిలాల్లే ఏ నిర్ణయాలైనా తీసుకుంటాయి. ఐతే... వీటి DNA మనుషుల DNA దాదాపు 99 శాతం సరిపోతోంది. అందుకే ఇవి మనుషులకు చాలా దగ్గరి పోలికలతో ఉంటాయి. ప్రవర్తనలో కూడా మనుషులలాగే ప్రవర్తిస్తాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే నాడు అప్‌లోడ్ చేసిన ఈ వీడియోని ఇప్పటివరకూ 3300 మంది చూశారు. 612 మంది లైక్ చేశారు. 162 మంది రీట్వీట్ చేశారు. కామెంట్లు తుఫాన్‌లా వస్తున్నాయి.


సుశాంత నందా ఇదివరకు కూడా ఇలాంటి అరుదైన వీడియోలను నెటిజన్లకు పంచారు. ఓసారి ఓ పెద్ద పులి... బెంగాల్ మాంగ్రూవ్ అడవుల్లో అరుస్తూ వెళ్లే వీడియో పెట్టారు. అప్పట్లో అది సంచలనం అయ్యింది. ఆ పెద్ద పులి అచ్చం మనుషులలా అరుస్తూ వెళ్లడంతో అందరూ ఆ వీడియోని తెగ చూశారు.
First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు