హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Google Search: గూగుల్ సెర్చ్‌ రిజల్ట్‌లో మిస్టేక్.. భారత్‌లో చండాలమైన భాష ఏదని సెర్చ్ చేస్తే..

Google Search: గూగుల్ సెర్చ్‌ రిజల్ట్‌లో మిస్టేక్.. భారత్‌లో చండాలమైన భాష ఏదని సెర్చ్ చేస్తే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

గూగుల్ సెర్చ్ ఫలితాల్లో మిస్టేక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భారత్‌లోనే చండాలమైన భాష ఏదనే ప్రశ్నకు గూగుల్ సెర్చ్ తప్పుడు సమాధానం చూపెట్టింది. దీంతో నెటిజన్‌లు, రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో గూగుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  గూగుల్ సెర్చ్ ఫలితాల్లో మిస్టేక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భారత్‌లోనే చండాలమైన భాష ఏదనే ప్రశ్నకు గూగుల్ సెర్చ్ తప్పుడు సమాధానం చూపెట్టింది. ఆ ప్రశ్నకు కన్నడ అనే సమాధానం ఇచ్చింది. దీంతో కన్నడ నెటిజన్లు గూగుల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ కోపాన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌ల రూపంలో ప్రదర్శించారు. మరోవైపు పార్టీలకు అతీతంగా నాయకులు గూగుల్‌పై విమర్శలు చేశారు. చండాలమైన భాషకు కన్నడ అనే సమాధానాన్ని గూగుల్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు.

  కర్ణాటక కల్చరల్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ అరవింద్ లింబవలీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంపై గూగుల్‌కు లీగల్ నోటీసులు పంపనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గూగుల్ కన్నడ‌కు, కన్నడిగులకు క్షమాపణ చెప్పాలన్నారు. కన్నడ భాషకు ప్రత్యేకమైన చరిత్ర ఉందన్నారు. 2,500 ఏళ్ల క్రితం నుంచి కన్నడ భాష వాడుకలో ఉందని చెప్పారు. చండాలమైన భాషగా కన్నడను చూపించడం.. తమను అవమానించడమేనని అన్నారు. ఇందుకు గూగుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


  మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కూడా గూగుల్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్ చేసిన తప్పు ఆమోదయోగ్యం కాదని అన్నారు. భాష అనేది భావోద్వేగాలకు సంబంధించిన విషయం.. అందుకే భాష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. గూగుల్ క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు.


  ఈ వివాదంపై స్పందించిన గూగుల్ ఇండియా క్షమాపణ కోరుతున్నట్టు తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘సెర్చ్ ఎల్లప్పూడు ఫర్‌పెక్ట్‌గా ఉండదు. కొన్నిసార్లు ఇంటర్‌నెట్‌లో కంటెంట్ వివరించిన విధానం.. నిర్దిష్ట ప్రశ్నలకు ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇస్తుంది. మా దృష్టికి ఇలాంటివి వచ్చినప్పుడు మేము వెంటనే చర్యలు తీసుకుంటాం. మేము నిరంతరం మా అల్‌గారిథమ్స్‌ను ఇంప్రూవ్ చేయడానికి పనిచేస్తాం’అని తెలిపింది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Google, Google search, Karnataka

  ఉత్తమ కథలు