భారతీయులకు Google షాక్.. ఇక నుంచి వాటిల్లో వైఫై బంద్..

Google Station : గూగుల్ స్టేషన్ పేరుతో భారత్‌లోని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు అందిస్తున్న గూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రోగ్రాంను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

news18-telugu
Updated: February 18, 2020, 9:35 AM IST
భారతీయులకు Google షాక్.. ఇక నుంచి వాటిల్లో వైఫై బంద్..
గూగుల్
  • Share this:
Google Station : గూగుల్ స్టేషన్ పేరుతో భారత్‌లోని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు అందిస్తున్న గూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రోగ్రాంను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలో ఇంటర్నెట్ ధరలు చవకగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ గుప్తా తెలిపారు. ‘ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్ సేవలుచవకగా మారిపోయాయి. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం. దక్షిణాఫ్రికా, నైజీరియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఇండోనేషియా, బ్రెజిల్‌లోనూ గూగుల్ స్టేషన్‌ను ఎత్తేస్తున్నాం. ఐదేళ్ల క్రితం గూగుల్ స్టేషన్లు ప్రారంభించినప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంటర్నెట్ సులభతరంగా, చవకగా మారింది. మొబైల్ డేటా ప్లాన్లు తక్కువ రేట్లకు అందుబాటులోకి వచ్చాయి. మొబైల్ కనెక్టివిటీ భారీగా విస్తరించింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు భారత్‌లో మొబైల్ డేటా లభ్యమవుతోంది. అప్పటితో పోలిస్తే మొబైల్ డేటా ధర 95 శాతం తగ్గింది’ అని ఆయన వెల్లడించారు.

కాగా, ట్రాయ్ గణాంకాల ప్రకారం దేశంలోని వినియోగదారులు నెలకు సగటున 10 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. ఈ గణాంకాలన్నింటినీ పరిశీలించాకే గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. అంటే ఇకనుంచి రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు ఉండబోవు. ఇది రైల్వే ప్రయాణికులకు కాస్త చేదు వార్తే.

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు