సలాం బాబా ఆమ్టే... అఖండ భారతావనికి మీ సేవలు చిరస్మరణీయం

ప్రముఖులు, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన వాళ్లను స్మరించుకోవడం మన బాధ్యత. సామాజిక వేత్త బాబా ఆమ్టే జయంతి సందర్భంగా మన దేశానికి ఆ మహనీయుడు చేసిన సేవల్ని ఓసారి స్మరించుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: December 26, 2018, 2:08 PM IST
సలాం బాబా ఆమ్టే... అఖండ భారతావనికి మీ సేవలు చిరస్మరణీయం
బాబా ఆమ్టే, సామాజిక వేత్త (ఫొటో - వికీపీడియా)
Krishna Kumar N | news18-telugu
Updated: December 26, 2018, 2:08 PM IST
సంఘ సంస్కర్త, సామాజిక వేత్త మురళీధర్ దేవిదాస్ ఆమ్టే (బాబా ఆమ్టే) 104వ జయంతి సందర్భంగా దేశం ఆయన సేవల్ని గుర్తుచేసుకుంటోంది. పేదలు, అన్నార్తుల కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు బాబా ఆమ్టే. ముఖ్యంగా కుష్టు వ్యాధిగ్రస్థులను అంటరాని వాళ్లలా చూసే రోజుల్లో... వాళ్లను అక్కున చేర్చుకొని నిలువ నీడను ఇచ్చిన దయనీయుడు బాబా ఆమ్టే. మన దేశాన్ని ఏకం చేసేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతలా కృషి చేశారో అదే స్థాయిలో అఖండ భారతావనిని నిర్మించేందుకు, అసమానతలను తొలగించేందుకు అహరహం కృషి చేసిన బాబా ఆమ్టే జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాల్ని ఓసారి తెలుసుకుందాం.

1914లో మహారాష్ట్రలోని ఓ సంపన్న కుటుంబంలో జన్మించారు బాబా ఆమ్టే. డబ్బుకి కొరత లేకపోవడంతో మొదట్లో ఆయన జల్సా లైఫ్ ఎంజాయ్ చేశారు. జంతువుల్ని వేటాడేవారనీ, క్రీడలు ఆడేవారనీ, లగ్జరీ కార్లలో తిరిగేవాళ్లనీ చరత్ర చెబుతోంది. లా చదివిన ఆమ్టే, 20 ఏళ్లకే తనకంటే సొంత సంస్థను నెలకొల్పి విజయవంతంగా దాన్ని నిర్వహించారు. కాలక్రమంలో దేశంలో పాతుకుపోయిన అన్యాయాలు, అసమానతలు ఆయన్ని కలచివేశాయి.

baba amte google doodle, baba amte, who was baba amte, indian social worker, google doodle, baba amte, prakash amte, amte, baba amte biography, baba, dr. prakash baba amte, baba amte life journey, dr. prakash baba amte - the real hero, baba amte son, vikas baba amte, great baba amte, who was baba amte, baba prakash amte, prakash baba amte, dr prakash amte, dr amte, baba amte anandvan, dr baba prakash amte, baba amte life story, dr prakash baba amte, dr. praksh baba amte, who was baba amte?google doodle, google, google doodles, doodle, best google doodles, google doodle today, today google doodle, google doodle games, selena google doodle, google doodle program, google doodle gameplay, halloween google doodle, 2018 google doodle, google doodle 25 december, google logo, google doodle competition, google doodle 4 google india, happy holidays google doodle, google doodle on christmas day, బాబా ఆమ్టే, గూగుల్ డూడుల్,
బాబా ఆమ్టే జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్


ఓ రోజు ఆమ్టే కుష్టువ్యాధిగ్రస్థుణ్ని చూశారు. ఒళ్లంతా కుళ్లిన చర్మంతో ఉన్న అతన్ని చూసి ఒక్కసారిగా భయపడ్డారు. ఆ తర్వాత ఆలోచనలో పడ్డారు. మన దేశంలో పేదలకు ఎందుకీ దుస్థితి అని ఆవేదన చెందారు. కుష్టువ్యాధిగ్రస్థులను అక్కున చేర్చుకున్నారు. దేశమంతా ఐక్యంగా ఉండాలంటూ.... 1985లో ఓ ఉద్యమాన్ని ప్రారంభించారు. తన 72 ఏళ్ల వయసులో కన్యాకుమారి నుంచీ కాశ్మీర్ వరకూ దాదాపు 5వేల కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి, దేశ ఐక్యత కోసం ప్రయత్నించారు.




baba amte google doodle, baba amte, who was baba amte, indian social worker, google doodle, baba amte, prakash amte, amte, baba amte biography, baba, dr. prakash baba amte, baba amte life journey, dr. prakash baba amte - the real hero, baba amte son, vikas baba amte, great baba amte, who was baba amte, baba prakash amte, prakash baba amte, dr prakash amte, dr amte, baba amte anandvan, dr baba prakash amte, baba amte life story, dr prakash baba amte, dr. praksh baba amte, who was baba amte?google doodle, google, google doodles, doodle, best google doodles, google doodle today, today google doodle, google doodle games, selena google doodle, google doodle program, google doodle gameplay, halloween google doodle, 2018 google doodle, google doodle 25 december, google logo, google doodle competition, google doodle 4 google india, happy holidays google doodle, google doodle on christmas day, బాబా ఆమ్టే, గూగుల్ డూడుల్,
బాబా ఆమ్టే జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్


ఆమ్టే సేవల్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 1971లో ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 1988లో మానవ హక్కుల విభాగంలో ఆయనకు ఐక్యరాజ్యసమితి అవార్డు దక్కింది. 1999లో గాంధీ శాంతి బహుమతి వరించింది. ఇంత గొప్ప వ్యక్తి కావడం వల్లే సెర్చ్ఇంజిన్ గూగుల్... బాబా ఆమ్టే జయంతి రోజున డూడుల్ ద్వారా ప్రత్యేక నివాళి అర్పిస్తోంది.
First published: December 26, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...