Home /News /trending /

GOOD SAMARITAN SAVES MAN IN WHEELCHAIR WHO FELL ONTO TRAIN TRACKS VIDEO GOES VIRAL GH SK

Viral Video: ప్లాట్‌ఫారంపైకి వస్తున్న రైలు.. పట్టాలపై పడిపోయిన దివ్యాంగుడు.. తర్వాత ఏం జరిగిందంటే..

పట్టాలపై పడిపోయిన దివ్యాంగుడు (Image:Instagram)

పట్టాలపై పడిపోయిన దివ్యాంగుడు (Image:Instagram)

మరికొన్ని సెకన్లలో ట్రైన్ రాబోతుందని అనౌన్స్ మెంట్ వినిపించింది. వీల్ ఛైర్‌లో ఉన్న వ్యక్తి ముందుకు రాబోయి పట్టు తప్పాడు. దీంతో ఒక్కసారిగా ప్లాట్ ఫాం నుంచి వీల్‌ఛైర్‌తో సహా ట్రాక్‌పై పడిపోయాడు.

సాధారణంగా రైల్వే స్టేషన్‌లో రైలు వచ్చే ముందు ప్లాట్ ఫాంపై చాలా వెనక్కి ఉండాలని అనౌన్స్‌మెంట్స్ ఇస్తుంటారు. సడన్‌గా ముందుకు వచ్చేస్తే ట్రాక్‌పై పడిపోతారేమో అన్న భయం కూడా దానికి కారణం. కానీ అలా రైలు వచ్చే ముందు ఎవరైనా సడన్‌గా ట్రాక్‌పై పడిపోతే.. ఆ పడిన వ్యక్తి కూడా ఓ వికలాంగుడైతే.. రైలు అతడి పైనుంచి వెళ్లిపోతుందేమో అన్నంత భయం వేస్తుంది కదా! కానీ అంతటి ప్రమాదకర పరిస్థితుల్లో కూడా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రైల్వే ట్రాక్‌పై దిగి వికలాంగుడిని రక్షించాడు ఓ వ్యక్తి. రైలు మరికొన్ని క్షణాల్లో వస్తుందని తెలిసి కూడా అతడు చేసిన ఈ సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆగస్టు నాలుగో తేదీ.. న్యూయార్క్‌లోని యూనియన్ స్క్వేర్ స్టేషన్ అది. ఉదయం 11 నుంచి 12 మధ్యలో కావడంతో స్టేషన్‌లో పెద్దగా రద్దీ లేదు. మరికొన్ని సెకన్లలో ట్రైన్ రాబోతుందని అనౌన్స్ మెంట్ వినిపించింది. వీల్ ఛైర్‌లో ఉన్న వ్యక్తి ముందుకు రాబోయి పట్టు తప్పాడు. దీంతో ఒక్కసారిగా ప్లాట్ ఫాం నుంచి వీల్‌ఛైర్‌తో సహా ట్రాక్‌పై పడిపోయాడు. ట్రైన్ రావడానికి మరికొన్ని సెకెన్లు మాత్రమే ఉండడంతో అతడి పరిస్థితి గురించి ఆలోచించి చాలామంది కంగారు పడిపోయారు.

అయితే ఆ వెంటనే ఓ వ్యక్తి ట్రాక్ పైకి దూకాడు. అతడి చేయి పట్టుకొని ప్లాట్ ఫాం పైకి ఎక్కించాడు. ఆ తర్వాత వీల్ ఛైర్‌ని కూడా ఎక్కించి అతడు కూడా ఎక్కాడు. అతడికి మరో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు సాయం చేసినా అందులో ఏ ఒక్కరూ ట్రాక్ పైకి దిగకపోవడం విశేషం. వీరంతా పైకి ఎక్కిన కొన్ని సెకన్లలోనే ట్రైన్ స్టేషన్‌కు చేరుకుంది. ఆ ట్రైన్ కనుక ఒక పది సెకెన్లు ముందుగా వచ్చి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించుకోవడానికే భయంగా అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సబ్ వే క్రియేచర్స్ అనే పేజీ పోస్ట్ చేసిన ఈ వీడియోకి 1,74 వేలకు పైగా లైకులు, 1.4 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.

ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ఆ వ్యక్తి చేసిన సాహసాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. అతడు చూపిన ధైర్యానికి మెడల్ అందించండి అని ఒకరు కామెంట్ చేశారు. ‘న్యూయార్క్‌లో నాకు తెలిసి ఇదొక్కటే మంచి విషయం, అక్కడ చాలామంది ధైర్యం గలవారు ఉంటారు. ఈ వ్యక్తి చేసిన పనికి నేను అతడికి సలాం చేస్తున్నా’ అంటూ మరో యూజర్ స్పందించారు. ‘ఆ వ్యక్తి తన ప్రాణాలను సైతం రిస్క్‌లో పెట్టి ఇతరులకు సాయం చేయాలనుకున్నాడు. ఇలాంటి వారిని దేవుడు ఎప్పుడూ ఆనందంగా ఉంచాలి’ అని ఇంకొకరు కామెంట్ రాశారు..
Published by:Shiva Kumar Addula
First published:

Tags: America, New york, Trending, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు