IRCTC Bharat Darshan: తెలుగు ప్రజలకు శుభవార్త... రూ.7,560 ప్యాకేజీతో దక్షిణ భారతదేశ యాత్ర

IRCTC Dakshin Bharat Yatra Tour Package | ఐఆర్‌సీటీసీ దక్షిణ్ భారత్ యాత్ర ప్యాకేజీ ప్రారంభ ధర రూ.7,560 మాత్రమే. ఇది స్టాండర్డ్ ప్యాకేజీ. కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.9240. మొత్తం 7 రాత్రులు, 8 రోజుల ప్యాకేజీ ఇది.

news18-telugu
Updated: November 29, 2019, 11:05 AM IST
IRCTC Bharat Darshan: తెలుగు ప్రజలకు శుభవార్త... రూ.7,560 ప్యాకేజీతో దక్షిణ భారతదేశ యాత్ర
IRCTC Bharat Darshan: తెలుగు ప్రజలకు శుభవార్త... రూ.7,560 ప్యాకేజీతో దక్షిణ భారతదేశ యాత్ర (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలుగు ప్రజలకు శుభవార్త. దక్షిణ భారతదేశ యాత్రకు వెళ్లాలనుకునేవారి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC 'దక్షిణ్ భారత్ యాత్ర' ప్యాకేజీని ప్రకటించింది. 2020 జనవరి 3న ప్రారంభమయ్యే టూర్ జనవరి 10న ముగుస్తుంది. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుచ్చి శ్రీరంగనాథస్వామి ఆలయం, రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయం, మధురైలోని మీనాక్షి ఆలయం, కన్యాకుమారి, తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయం, మహాబలిపురం, కాంచీపురంలోని కామాక్షి ఆలయాలకు తీసుకెళ్తారు. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారు సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలో రైలు ఎక్కొచ్చు. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.7,560 మాత్రమే. ఇది స్టాండర్డ్ ప్యాకేజీ. కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.9240. మొత్తం 7 రాత్రులు, 8 రోజుల ప్యాకేజీ ఇది. టూర్ ప్యాకేజీలో బస, టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, డిన్నర్, రోజూ 1 లీటర్ వాటర్ బాటిల్, వాహనంలో సైట్ సీయింగ్‌ లాంటివి కవర్ అవుతాయి.

IRCTC Dakshin Bharat Yatra Tour Package: ఐఆర్‌సీటీసీ దక్షిణ్ భారత్ యాత్ర ప్యాకేజీ వివరాలివే...



ఐఆర్‌సీటీసీ దక్షిణ్ భారత్ యాత్ర 2020 జనవరి 3న (జనవరి 2 అర్థరాత్రి) ప్రారంభమవుతుంది. అర్థరాత్రి 12:05 గంటలకు సికింద్రాబాద్‌లో భారత్ దర్శన్ టూరిస్ట్ రైలు ఎక్కాలి. జనవరి 3 మొత్తం రైలు ప్రయాణమే ఉంటుంది. జనవరి 4న ఉదయం ఫ్రెషప్ అయిన తర్వాత శ్రీరంగం, భృదీశ్వర ఆలయాల సందర్శన ఉంటుంది. ఆ తర్వాత అక్కడ్నుంచి బయల్దేరాలి. జనవరి 5న తెల్లవారుజామున రామేశ్వరం చేరుకుంటారు. నదీ స్నానం తర్వాత రామనాథస్వామి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత రామేశ్వరం నుంచి బయల్దేరి మధురైకి చేరుకోవాలి. మీనాక్షి ఆలయ దర్శనం, సుందరేశ్వర ఆలయాల సందర్శన ఉంటుంది. జనవరి 6న నాగర్‌కోయిల్‌కు చేరుకుంటారు. నాగర్‌కోయిల్ ఆలయ దర్శనం, కుమారి అమ్మన్ ఆలయం, గాంధీ మెమోరియల్, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లూర్ స్టాచ్యూ, సూర్యాస్తమయ దర్శనం ఉంటాయి.

జనవరి 7న నాగర్‌కోయిల్ నుంచి కొచ్చువేలికి బయల్దేరాలి. కోవాలం బీచ్, పద్మనాభ ఆలయ సందర్శన తర్వాత కొచ్చువేలి నుంచి బయల్దేరాలి. జనవరి 8న చంగల్‌పట్టు చేరుకుంటారు. మహాబలిపురం సందర్శన తర్వాత రాత్రికి చంగల్‌పట్టు లేదా మహాబలిపురంలో బస ఉంటుంది. జనవరి 9న ఉదయం కాంచీపురానికి బయల్దేరాలి. కంచి కామాక్షి ఆలయ సందర్శన తర్వాత తిరిగి చంగల్‌పట్టుకు చేరుకోవాలి. అక్కడ్నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. జనవరి 9న రేణిగుంట, జనవరి 10న నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, సికింద్రాబాద్ చేరుకోవడంతో దక్షిణ్ భారత్ యాత్ర ముగుస్తుంది.

ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దేశంలోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కల్పించేందుకు భారతీయ రైల్వే భారత్ దర్శన్ టూరిస్ట్ రైళ్లను నడుపుతోంది. ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌లో భారత్ దర్శన్ టూర్ ప్యాకేజీలు కనిపిస్తాయి.

అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

IRCTC: శ్రీరామ భక్తులకు శుభవార్త... ఐఆర్‌సీటీసీ నుంచి అద్భుతమైన టూర్ ప్యాకేజీ

IRCTC: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? రీఫండ్ రూల్స్ మారాయి

Sabarimala: శబరిమల వెళ్తున్నారా? ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేయండి ఇలా
Published by: Santhosh Kumar S
First published: November 7, 2019, 12:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading