Bank Timings: గుడ్ న్యూస్... బ్యాంకు వేళలు మారబోతున్నాయి

Bank Timings | బ్యాంకు వేళల్ని మార్చే విషయమై ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్‌లో ఓ సమావేశం నిర్వహించింది. కస్టమర్ల సౌలభ్యాన్ని బట్టి బ్యాంకు వేళలు ఉండాలని సూచించింది.

news18-telugu
Updated: August 14, 2019, 12:57 PM IST
Bank Timings: గుడ్ న్యూస్... బ్యాంకు వేళలు మారబోతున్నాయి
Bank Timings: గుడ్ న్యూస్... బ్యాంకు వేళలు మారబోతున్నాయి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
అత్యవసరంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేందుకో లేదా డీడీ కట్టేందుకో హడావుడిగా వెళ్లేసరికి బ్యాంకు మూతపడుతుంది. ఏం చేయాలో అర్థం కాక మరుసటి రోజు వరకు ఎదురుచూడక తప్పదు. ఇలాంటి పరిస్థితి అనేక మందికి ఎదురయ్యే ఉంటుంది. డిజిటల్ లావాదేవీలు పెరిగి బ్యాంకులపై ఆధారపడటం తగ్గిపోయినా కొన్ని లావాదేవీల కోసం బ్రాంచ్‌కు వెళ్లక తప్పని పరిస్థితి ఉంది. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా బ్యాంకు వేళలు లేవన్న వాదన ఎప్పట్నుంచో ఉన్నదే. అందుకే బ్యాంకు వేళల్ని కస్టమర్లకు అనుకూలంగా మార్చాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన బ్యాంకింగ్ డివిజన్ వీటిపై దృష్టిపెట్టింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల వేళల్ని మార్చాలని నిర్ణయించింది. సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉదయం 10 గంటలకు తెరుచుకుంటాయి. వాటిని 9 గంటలకు మారిస్తే ఎలా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన బ్యాంకింగ్ డివిజన్ ఆలోచిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు రీజనల్ రూరల్ బ్యాంక్-RRB వేళలు మారనున్నాయి.

బ్యాంకు వేళల్ని మార్చే విషయమై ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్‌లో ఓ సమావేశం నిర్వహించింది. కస్టమర్ల సౌలభ్యాన్ని బట్టి బ్యాంకు వేళలు ఉండాలని సూచించింది. అందుకు తగ్గట్టుగా వేళల్ని మార్చేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇండియన్ బ్యాంక్ అసోసియేన్-IBA సమావేశమై మూడు వేళల్ని నిర్ణయించింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లేదా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు లేదా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాంకు వేళల్ని సూచించింది. జిల్లా స్థాయి కస్టమర్ కోఆర్డినేషన్ కమిటీతో చర్చించి వేళలపై ఆగస్ట్ 31 లోగా నిర్ణయం తీసుకోవాలని బ్యాంకులను కోరింది IBA. మారిన వేళల గురించి స్థానిక దినపత్రికల్లో సమాచారం ఇవ్వాలని సూచించింది. మారిన వేళలు సెప్టెంబర్ నుంచే అమలులోకి వస్తాయి.

Realme X: స్మార్ట్‌ఫోన్‌తో ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ... అదిరిపోయిన ఫోటోలు




ఇవి కూడా చదవండి:

Update Mobile Number: బ్యాంకుకు వెళ్లకుండా మొబైల్ నెంబర్ మార్చేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి

IRCTC: హనీమూన్‌ ప్లాన్ చేసుకుంటున్నారా? ప్యారిస్ తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ
Loading...
ICICI: వడ్డీ లేకుండా అప్పు ఇస్తున్న ఐసీఐసీఐ... పేలేటర్ అకౌంట్ వివరాలివే
First published: August 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...