హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్

ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్న జంటనగరవాసులకు మెట్రోరూపంలో కాస్త ఊరట లభించింది. దీనికితోడు తాజాగా వచ్చిన గుడ్‌న్యూస్ హైదరాబాద్ ప్రయాణికులను ఖుషీ చేస్తోంది. ఇంతకీ ఏంటది?

ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్న జంటనగరవాసులకు మెట్రోరూపంలో కాస్త ఊరట లభించింది. దీనికితోడు తాజాగా వచ్చిన గుడ్‌న్యూస్ హైదరాబాద్ ప్రయాణికులను ఖుషీ చేస్తోంది. ఇంతకీ ఏంటది?

ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్న జంటనగరవాసులకు మెట్రోరూపంలో కాస్త ఊరట లభించింది. దీనికితోడు తాజాగా వచ్చిన గుడ్‌న్యూస్ హైదరాబాద్ ప్రయాణికులను ఖుషీ చేస్తోంది. ఇంతకీ ఏంటది?

  జంట‌నగరాల్లో మెట్రో పరుగులు తీయడం మొదలెట్టి చాలారోజులైనా.. టిక్కెట్ రేట్లు అధికంగా ఉండడం, మెట్రోస్టేషన్‌లు నివాసాలకు దూరంగా ఉండడం సహా తదితర కారణాలతో చాలామంది ఇంకా బస్సులు, ఆటోల్లోనే ప్రయాణాలు చేస్తున్నారు. మెట్రో స్టేషన్‌కు చేరుకోవాలంటే ఆటోనో, బస్సో ఎక్కి  చార్జీలు చెల్లించడం.. మళ్లీ మెట్రో ట్రైన్ ‌టిక్కెట్‌కు భారీగానే చెల్లించుకోవడం సామాన్యులకు కాస్త ఇబ్బందిగా మారుతోంది. అందుకే చాలామంది మెట్రోను ఏదో సరదాకి.. ఎప్పుడో ఒకసారి ఎక్కడం మినహా రెగ్యులర్‌గా ప్రయాణాలు చేయడాని ఆసక్తి చూపడంలేదు.

  Telangana minister ktr inspects hyderabad metro phase 2 works
  ప్రతీకాత్మక చిత్రం

  ఇప్పట్నుంచి ఇలాంటి ఇబ్బందులేం లేకుండా మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌లను అనుసంధానం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది హెచ్ఎంఆర్ఎల్(హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్). మెట్రోట్రైన్, ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌లకు కలిపి ప్రయాణికులకు ఒకే కార్డును మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇది నెలవారీ బస్‌పాస్‌లా పనిచేస్తుందనమాట. సో ఒక్క కార్డుతో బస్సుల్లోనూ, ఎంఎంటీఎస్‌లోనూ, మెట్రోట్రైన్‌లోనూ ప్రయాణించొచ్చన్నమాట. వీలైతే మెట్రోతో అనుంధానం చేయబడిన పలు ఆటోల్లోనూ ఈ కార్డును వినియోగించుకోవచ్చు.

  tsrtc, buses, kondagattu accident, టీఎస్‌ఆర్టీసీ, కొండగట్టు ప్రమాదం,
  నమూనా చిత్రం

  ఈ ప్లాన్ కోసం కసరత్తు మొదలుపెట్టింది మెట్రో సంస్థ. దీనిపై వారం రోజుల్లోనే విధివిధానాలు ఖరారు కానున్నాయి. పైలట్ ప్రాజెక్టుగా జనవరి చివరలోగా ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి విడతగా రెండు మెట్రోస్టేషన్లు, 100 ఆర్టీసీ బస్సులకు, 50 ఆటోలకు అనుసంధానం చేయనున్నారు. ఈ స్కీమ్ అందుబాటులోకి వస్తే ఒకే కార్డ్ (పాస్)తో అటు మెట్రోలోనూ, ఆర్టీసీ బస్సుల్లోనూ, ఎంఎంటీఎస్‌లోనూ ప్రయాణం చేయవచ్చు. దీని ధర ఎంత? ఎప్పుడెప్పుడు రెన్యువల్ చేసుకోవాలి? అనే అంశాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.

  First published:

  Tags: Auto News, Hyderabad, Hyderabad Metro, Tsrtc

  ఉత్తమ కథలు