రుతుక్రమ సమయంలో మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత అంశం పెద్ద సవాలుగా మారుతుంది. ముఖ్యంగా పేద యువతులు, మహిళల్లో శానిటరీ న్యాప్కిన్స్ కొనేంత ఆర్థిక శక్తి ఉండదు. వ్యక్తిగత పరిశుభ్రతను సరిగ్గా పాటించకపోవడం ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఇలాంటి సవాళ్లను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం శానిటరీ న్యాప్కిన్స్ని ఒక్క రూపాయికే అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జన్ ఔషధీ కేంద్రాల్లో బయోడీగ్రేడబుల్ శానిటరీ న్యాప్కిన్స్ని 'సువిధ' పేరుతో అతి తక్కువ ధరకే అందిస్తోంది కేంద్రం. ప్రస్తుతం ఒక శానిటరీ న్యాప్కిన్కు రూ.2.50 చెల్లించాల్సి వస్తుంది. రూ.10 చెల్లిస్తే నాలుగు ప్యాడ్స్ ఉన్న ప్యాకెట్ లభిస్తుంది. ఒక్క రూపాయికే ఒక న్యాప్కిన్ అందించాలన్న ఉద్దేశంతో నాలుగు ప్యాడ్స్ ఉన్న ప్యాకెట్‌కు రూ.4 మాత్రమే తీసుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదేశించారు. కొత్త ధరలు ఆగస్ట్ 27 నుంచే అమలులోకి వస్తాయి.
తక్కువ ధరకే శానిటరీ న్యాప్కిన్స్ అందించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 మార్చిలో ప్రారంభించింది. 2018 మే నుంచి జన్ ఔషధీ కేంద్రాల్లో శానిటరీ న్యాప్కిన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒక్క ఏడాదిలోనే 2.2 కోట్ల శానిటరీ న్యాప్కిన్స్ అమ్మడం విశేషం. ఇప్పుడు ధరల్ని తగ్గించడంతో సేల్స్ రెండింతలవుతాయని అంచనా వేస్తోంది కేంద్రం. ప్రస్తుతం మార్కెట్లో ఇతర శానిటరీ న్యాప్కిన్ ధర రూ.6 నుంచి రూ.8 మధ్య ఉంటోంది. ప్రభుత్వమే తక్కువ ధరకు న్యాప్కిన్స్ అందించడం ద్వారా మహిళా సాధికారతకు తోడ్పడినట్టు అవుతుంది.
Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
LIC Jeevan Amar: రూ.10,800 ప్రీమియంతో రూ.1 కోటి బీమా... ఎల్ఐసీ కొత్త పాలసీ వివరాలివే
IRCTC: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra modi, Pm modi, Tips For Women, Women, Women health