వరద నీరే స్విమ్మింగ్ పూల్... తేలుతూ వెళ్లిన యువకుడు... వైరల్ వీడియో

వరద నీరు రోడ్డుపైకి వచ్చేసిందని అందరూ కంగారు పడుతుంటే... అతను మాత్రం హాయిగా ఆ నీటిలో తేలుతూ ఎంజాయ్ చేశాడు.

news18-telugu
Updated: July 29, 2020, 2:25 PM IST
వరద నీరే స్విమ్మింగ్ పూల్... తేలుతూ వెళ్లిన యువకుడు... వైరల్ వీడియో
వరద నీరే స్విమ్మింగ్ పూల్... తేలుతూ వెళ్లిన యువకుడు... వైరల్ వీడియో (credit - twitter)
  • Share this:
పాకిస్థాన్... కరాచీలో జరిగిందీ ఘటన. మన దేశంలో ఎలాగైతే... ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయో... పాకిస్థాన్‌లోనూ అలాగే కురుస్తున్నాయి. ఇక వరదలు కామనయ్యాయి. కరాచీలో వరదలు బాగా పెరిగాయి. అసలే అది తీరప్రాంత నగరం కావడంతో... ముంబై లాగా మునిగింది. దాంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ పనీ చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో ఓ వ్యక్తి... ఆ వరద నీటిలో... తేలుతూ... రోడ్డుపై హాయిగా వెళ్తుంటే... అది చూసి అంతా ఆశ్చర్యపోయారు. జనరల్‌గా వరద నీటిలో చిక్కుకున్న వాళ్లు... తేలుతూ వెళ్లడం కుదరదు. మరి అతనికి ఎలా సాధ్యమైంది అంటే... అతను వేసుకున్న సల్వార్... గాలితో నిండిపోయింది. అది నీటిలో తేలుతూ... అతన్ని ముందుకు తీసుకెళ్లింది.


ఇది చాలా ఫన్నీగా ఉందని కొందరు అంటుంటే... అలాంటి నీటిలో అలా వెళ్తే అడ్డమైన వ్యాధులూ వస్తాయని మరికొందరు అంటున్నారు.

ఇది చూసిన ఓ నెటిజన్ వరైటీ కామెంట్ పెట్టారు. జీవితం నీకు నిమ్మకాయలు ఇస్తే... నిమ్మరసంతో జ్యూస్ చేసుకో అని రాశారు. తద్వారా... అలా వెళ్లడంలో తప్పేమీ లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
Published by: Krishna Kumar N
First published: July 29, 2020, 2:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading