ఫుట్‌బాల్ అంత గోల్డ్‌ఫిష్‌లు... పర్యావరణానికి ప్రమాదకరం అంటూ అధికారుల సరికొత్త ఆదేశాలు

ఫుడ్‌బాల్ అంత గోల్డ్‌ఫిష్‌లు (Image: Twitter/BurnsvilleMN)

Viral: గోల్డ్ ఫిష్‌లు మహా అయితే... మన చేతి వేలంత పెరుగుతాయి. మరి అవి ఏకంగా ఫుట్‌బాల్ అంత సైజులో ఎలా పెరిగాయి... దీనిపై సైంటిస్టులు ఏమంటున్నారు... పూర్తి వివరాలు ఇవీ...

 • Share this:
  Viral: గోడిగుడ్డంత గోధుమ గింజ అనే స్టోరీ తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఉంటుంది. అందులో... ఓ మైదానంలో పిల్లలు ఆడుకుంటుంటే... వారికి కోడుగుడ్డంత సైజులో ఉన్న గోధుమ గింజ దొరుకుతుంది... దాన్ని చూసి పిల్లలు ఆశ్చర్యపోతారు... అదే విధంగా... ఫుట్‌బాల్ సైజులో పెరిగిన గోల్డ్‌ఫిష్‌లను చూసి... వారు కూడా ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఈ చేపలు 2 లేదా 3 అంగుళాల సైజు మాత్రమే పెరుగుతాయి. ఆ తర్వాత చనిపోతాయి. అందుకే వీటిని ఎక్వేరియంలలో పెంచుకుంటారు. అలాంటిది... అమెరికా మిన్నెసొటాలో... అధికారులు... భారీ సైజులో చేపల్ని చూసి షాక్ అయ్యారు. ఈ చేపల్ని ఒకప్పుడు... స్థానికులు పెంచుకునేవారు... ఓ దశలో వారు... వీటిని పారేయాలని భావించి... అడవిలోని బర్న్స్ విల్లే దగ్గర్లో ఉన్న కెల్లార్ లేక్‌లో వదిలేశారు.

  ఈ చేపలు సరస్సులో దండిగా ఆహారం దొరకడం... అటూ ఇటూ వెళ్లేందుకు ఎక్కువ ప్లేస్ ఉండటంతో... బాగా తిని... బాగా పెరిగాయి. ఇది చూసిన అధికారులు షాకవ్వడమే కాదు... ఓ సంచలన ఆర్డర్ కూడా జారీ చేశారు. "ఇకపై ఎవరూ కూడా... నదులు, చెరువుల్లో గోల్డ్‌ఫిష్‌లను వదలొద్దు. అలా వదిలితే... అవి మీరు అనుకున్న దాని కంటే పెద్దగా పెరగగలవు. నీటి నాణ్యతను దెబ్బతీస్తాయి. నీటిలోపలున్న సున్నపురాతిని పాడుచేస్తాయి. అలాగే... మొక్కల వేర్లను తినేస్తాయి. పర్యావరణం దెబ్బతింటుంది" అని ఆర్డరేశారు.

  ఫుడ్‌బాల్ అంత గోల్డ్‌ఫిష్‌లు (Image: Twitter/BurnsvilleMN)


  ఎక్వేరియం చిన్నగా ఉంటుంది కాబట్టి... వాటిలో గోల్డ్‌ఫిష్‌లు ఎక్కువగా పెరగలేవు. పైగా వాటికి అక్కడ ఆహారం కూడా రోజుకు 2 లేదా 3 సార్లే... కొద్దిగానే వేస్తారు. అదే నదుల్లో, చెరువుల్లో అయితే... ఎంతైనా తినగలవు. ఇక్కడా అదే జరిగింది. అందువల్ల గోల్డ్‌ఫిష్‌లను పెంచలేము అనుకునేవారు... వాటిని పెంచగలిగే వారికి ఇవ్వాలే తప్ప... నదులు, చెరువుల్లో వదలొద్దు అని అధికారులు తెలిపారు.

  ఫుడ్‌బాల్ అంత గోల్డ్‌ఫిష్‌లు (Image: Twitter/BurnsvilleMN)
  ఇది కూడా చదవండి: Video: ఆకాశం నుంచి చేపలు.. అసలు కథ వేరే ఉందిలే...

  కెల్లార్ సరస్సులో... ఎక్కడ చూసినా గోల్డ్ ఫిష్‌లే ఉండటంతో... ఎవరో అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో... ఈ విషయం బయటపడింది. ఈ చేపలు చాలా వేగంగా గుడ్లు పెడతాయి. వీటి సంతానాన్ని వేగంగా పెంచుకుంటాయి. ఫలితంగా... మిగతా చేపలు బతకలేవు. ఈ షాకింగ్ విషయాలు తెలుసుకొని... వామ్మో అంటున్నారు స్థానికులు.
  Published by:Krishna Kumar N
  First published: