హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: చెత్త కుప్పలో 5 లక్షల విలువైన బంగారం.. అసలేం జరిగిందంటే..

OMG: చెత్త కుప్పలో 5 లక్షల విలువైన బంగారం.. అసలేం జరిగిందంటే..

కాగితం పొట్లం తింటున్న ఎలుక

కాగితం పొట్లం తింటున్న ఎలుక

Mumbai: మహిళ ఇంటి నుంచి బ్యాంకుకు బంగారం డిపాజిట్ చేద్దామని వెళ్లింది. ఈ క్రమంలో వడపావ్ కవర్ ను పెట్టుకుంది. దాంట్లోనే బంగారం డిపాజిట్ చేసే బ్యాగ్ కూడా పెట్టుకుంది.

కొందరికి తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. ఒకటి అనుకొని మరోకటి చేసేస్తుంటారు. ప్రతి విషయాన్ని మర్చిపోతుంటారు. మనం కొన్ని సార్లు.. ఇంటిలో బైటకు వెళ్లేటప్పుడు ఒక బ్యాగ్ అనుకొని మరోక బ్యాగ్ తీసుకెళ్తాము. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కాసేపటికి లాక్ పేట్టింది మర్చిపోతుంటాం. మరల ఇంటికి వెళ్లి చూసుకుంటాం. కొందరు టిఫిన్ బాక్సులు తీసుకెళ్లడం, ఆఫీస్ పనులు మర్చిపోతుండటం వంటి ఘటనలు మనం చూస్తునే ఉంటాం.

ఇక ఇంట్లో మహిళలు.. వస్తువులను ఒక చోట పెట్టి మరో చోట వెతుకు తుంటారు. కొన్ని సార్లు.. ఇంట్లో బంగారం, వెండి వంటి కాస్లీ వస్తువులను వేరే చోట పెట్టి మర్చి పోతుంటారు. కొందరు తమ వస్తువులను అజాగ్రత్తగా పాడేసుకుంటుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఈ వింత సంఘటన ముంబైలో (Mumbai) జరిగింది. గోరేగావ్ లోని గోకుల్ ధామ్ కాలనీకి చెందిన 45 ఏళ్ల సుందరి ప్లానిబెల్ అనే మహిళ.. ఒక ఇంటిలో పనిచేసేది. ఈ క్రమంలో ఆమె.. తన బంగారాన్ని బ్యాంక్ లాకర్ లో పెట్టడానికి వెళ్లింది. అయితే, ఆమె వెళ్లేటప్పుడు వడపావ్ లను ఒక కవర్ లో పెట్టుకుని వెళ్లింది. ఇక దానిలో పాటే.. బంగారం ఉన్న బ్యాగ్ ను కూడా అదే కవర్ పెట్టింది. దానిలో ఆమె 5 లక్షల విలువైన బంగారం బ్యాగ్ ను పెట్టింది. వెళ్లేటప్పుడు వీధిలో కొంత మంది వీధిబాలలు కన్పించారు. ఆమె వడపావ్ కవర్ ను వాళ్లకి తినడానికి ఇచ్చేసింది. దానిలోనే బంగారం కవర్ కూడా ఉందని సంగతి ఆమె మర్చిపోయింది.

బ్యాంక్ కు వెళ్లి చూసుకునే సరికి అప్పుడు ఆమెకు గుర్తోచ్చింది. వెంటనే కంగారుపడిపొయింది. కాసేపు గుర్తు ఏంచేశానని గుర్తు తెచ్చుకుంది. కాసేపటికి ఆమె చేసిన పొరపాటు గుర్తొచ్చింది. వెంటనే పరిగెత్తుకుంటూ పొద్దున పిల్లలు ఉన్న స్థలానికి వచ్చింది. అక్కడికి వచ్చి పిల్లల కోసం వెతికింది. కానీ ఏం లాభం... పిల్లలు ఆమెకు కన్పించలేదు. సుందరి ప్లానిబెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోనికి దిగిన అధికారలు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. వీధిబాలలను గుర్తించారు. కవర్ గురించి ఆరా తీయగా.. తమకు వడపావ్ నచ్చలేదని చెత్త కుప్పలో పాడేశామని అన్నారు. వెంటనే అక్కడికి చెత్తకుప్పలో వెతకగా.. బంగారం కవర్ చినిగిపోయి కన్పించింది. అక్కడ చైన్ లు ఉండం ఆమె చూసింది.

వెంటనే వాటిని తీసుకుంది. కొన్ని ఎలుకలు (Rats) అక్కడ కవర్ ను చింపేసి, వడపావ్ తింటున్నాయి. వెంటనే మహిళ కవర్ ను తీసేసుకుంది. (5 Lakh Recovered From Rats) మొత్తానికి పొయిందనుకున్న బంగారం దొరకడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. పోలీసులు ఆమెకు బ్యాగ్, బంగారం అప్పగించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో (Social media) ట్రెండింగ్ గా మారింది.

First published:

Tags: Gold, Mumbai, Rats

ఉత్తమ కథలు