Gold Rates | బంగారం ధరలు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకు వేలకు వేలు పెరుగుతూ భయపెడుతోంది. స్టాక్ మార్కెట్ల పతనం, ఆర్థిక మాంద్యం భయంతో పసిడి రేట్లు కొండెక్కుతున్నాయి.
బంగారం ధరలు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకు వేలకు వేలు పెరుగుతూ భయపెడుతోంది. స్టాక్ మార్కెట్ల పతనం, ఆర్థిక మాంద్యం భయంతో పసిడి రేట్లు కొండెక్కుతున్నాయి. మరోవైపు, రూపాయి వాల్యూ క్షీణిస్తోంది. క్రూడాయిల్ ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ఈ పర్యవసానాలు బంగారానికి డిమాండ్ తెచ్చి పెట్టాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సోమవారం నాడు రూ.45,000 స్థాయిని దాటేసింది. ముంబైలో తులం పసిడి రూ.44,014 పలికింది. అయితే, ఉగాది లేదా.. అక్షయ తృతీయ (ఏప్రిల్ 26) నాటికి బంగారం ధర రూ.50 వేలకు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ రేటు ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి అంటే..1,700 డాలర్లకు ఎగబాకింది.
త్వరలో ఆ రేటు 1900 డాలర్లకు చేరుకునే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. కరోనా ప్రభావంతో పాటు.. సౌదీ, రష్యా మధ్య నడుస్తున్న ధరల యుద్ధం నేపథ్యంలో పెట్రోలియం ధరలు వారంలో 20 డాలర్లకు పడిపోయే అవకాశం ఉందని వివరిస్తున్నారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.