హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Great labour woman : చెత్తలో పది తులాల బంగారం.. తిరిగి అప్పగించిన పారిశుద్ద్య కార్మికురాలు..

Great labour woman : చెత్తలో పది తులాల బంగారం.. తిరిగి అప్పగించిన పారిశుద్ద్య కార్మికురాలు..

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

Great labour woman : చెత్త కుప్పలో దొరికిన బంగారాన్ని సీదా తన ఇంటికి తీసుకోని పోకుండా ఓ పారిశుధ్ద్య కార్మికులను తిరిగి అప్పగించి తన నిజాయితిని చాటుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది తులాల బంగారం తన చేతికి చిక్కినా నిజాయితీగా తన యజనానికి అప్పగించి ప్రశంసలు పొందుతోంది.

ఇంకా చదవండి ...

చెత్తకుప్పలో ఏదైన పడిందంటే ఇక అది అంతే సంగతులు.. అది విలువైన వస్తువులైనా ,ఇంకా ఏదైనా సరే.. కాని అదే చెత్త కుప్పలోకి చేరిందంటే దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తు ఉంటుంది. అయితే చెత్త కుప్పకు చేరిన పది తులాల బంగారం తిరిగి భాధితుడి ఇంటికే చేరింది. దీనికి కారణం తమిళనాడులోని నిజాయితిగా పని చేసిన పారిశుద్ద్య కార్మికురాలు.

తమిళనాడులోని ( Tamilnadu ) ఓ పారిశుద్య కార్మికురాలు పేదరికంలో ఉన్నా.. డబ్బు కంటే నీతికే ఎక్కువ విలువ ఇచ్చే వ్యక్తులూ ఉన్నారని నిరూపించింది. ఓ వ్యక్తి రూ.7.5లక్షల విలువ చేసే 10 తులాల బంగారాన్ని ( gold ) పొగొట్టుకోగా.. పారిశుద్ధ్య కార్మికురాలికి దొరికింది. దాన్ని ఆమె నిజాయితీతో తిరిగి ఇచ్చేసింది.

ఇది చదవండి : అదృష్టం తలుపు తట్టేలోపు దురదృష్టం షేక్ హ్యాండ్.. లాటరీ గెల్చుకున్న తరువాత అష్టకష్టాలుపడ్డ దంపతులు


వివరాల్లోకి వెళితే..సతాంగులమ్‌ ప్రాంతానికి చెందిన గణేశ్‌ రామన్‌ అనే వ్యక్తి ఓ కొరియర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతి నెల వచ్చే జీతంలో ( salary ) కొంత మొత్తాన్ని కూడబెట్టి ఇటీవల 10 తులాల బంగారు డాలర్‌ను కొనుగోలు చేశాడు. దాన్ని తీసుకెళ్లి ఇంట్లో వాళ్లకు తెలియకుండా తన బెడ్‌ ( bed ) కింద దాచిపెట్టాడు. అయితే.. ఆ.. మరుసటి రోజు గణేశ్‌ భార్య బెడ్‌రూమ్‌ను శుభ్రం ( cleaning ) చేసే క్రమంలో బంగారం ఉన్న ప్యాకెట్‌ను చూసుకోకుండా చెత్తకుప్పలో పడేసింది. ఈ విషయం తెలుసుకున్న గణేశ్‌ షాక్‌కు ( shock ) గురయ్యాడు..

 ఇది చదవండి : ప్రపంచ కుబేరుడి కూతురు వివాహం ..ఖర్చు ఎంతో తెలుసా..?


దీంతో వెంటనే ఆ చెత్తకుప్ప దగ్గరికెళ్లి చూస్తే అప్పటికే పారిశుద్ధ కార్మికులు చెత్తను తొలగించేశారు. అయితే గణేశ్‌ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ( police station ) ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు బంగారం పోయిన రోజు చెత్త తొలగించే విధుల్లో ఉన్న పారిశ్యుద్ధ కార్మికుల వివరాలు తీసుకొని వారిని విచారించారు. ఈ క్రమంలోనే ఆ రోజు విధులు నిర్వర్తిస్తున్న మేరి అనే పారిశ్యుద్ధ కార్మికురాలికే గణేశ్‌ పోగొట్టుకున్న బంగారం దొరికినట్లు గుర్తించారు.

మేరీని ప్రశ్నించగా.. ఆమె అప్పటికే తనకు దొరికిన బంగారాన్ని.. దాని యజమానికి అందజేయమని ఉన్నతాధికారులకు అప్పగించి. దీంతో సతాంగులమ్‌ పోలీసులు అధికారుల్ని, మేరీని, గణేశ్‌ను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి.. పోయిన బంగారాన్ని మేరీ చేతులమీదుగా గణేశ్‌కు అప్పగించారు.

First published:

Tags: Gold jewellery, National News, Tamilnadu, Trending