GODADDY APOLOGISES OVER FAKE CHRISTMAS BONUS PHISHING EMAIL NS
క్రిస్మస్ బోనస్ అంటూ మెయిల్ పంపి.. సెక్యూరిటీ టెస్ట్ అంటూ షాకిచ్చిన కంపెనీ.. ఉద్యోగుల ఆందోళనతో చివరికి..
ప్రతీకాత్మక చిత్రం
GoDaddy: తాజాగా ఓ కంపెనీ తమ కంపెనీ ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నామంటూ ఓ మెయిల్ పంపించింది. ఒకొక్కరికి 650 డాలర్లు హాలిడే బోనస్ గా ఇస్తున్నామనంటూ మెయిల్ లో పేర్కొనడంతో సంబరాలు చేసుకున్నారు. అయితే రెండు రోజులకు ఆ కంపెనీ చావు కబురు చల్లగా చెప్పి ఉద్యోగుల ఆనందం ఆవిరయ్యేలా చేసింది.
సాధారణంగా ఏ స్థాయి ఉద్యోగులైనా బోనస్, వేతనాల పెంపుపై ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటారు. ఈ విషయాలను ఎప్పటికప్పుడూ ఆరా తీస్తూ ఉంటారు. పని చేస్తున్న కంపెనీ ఎప్పుడైనా బోనస్, ఇంక్రిమెంట్ ఇస్తే ఉద్యోగులు ఎగిరి గంతేస్తారు. తమ కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చిందంటూ ఆనందిస్తారు. తాజాగా ఓ కంపెనీ తమ కంపెనీ ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నామంటూ ఓ మెయిల్ పంపించింది. అయితే దాన్ని ఓపెన్ చేసిన ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఒకొక్కరికి 650 డాలర్లు హాలిడే బోనస్ గా ఇస్తున్నామనంటూ మెయిల్ లో పేర్కొనడంతో సంబరాలు చేసుకున్నారు. అయితే రెండు రోజులకు ఆ కంపెనీ చావు కబురు చల్లగా చెప్పి ఉద్యోగుల ఆనందం ఆవిరయ్యేలా చేసింది. బోనస్ అంటూ వచ్చిన మెయిల్ సెక్యూరిటీ పరీక్షల కోసం పంపామని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులంతా కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన ప్రముఖ గోడాడీ సంస్థ ఉద్యోగులకు డిసెంబరు 14న ఓ మెయిల్ పంపించింది. ఉద్యోగులందరికీ హాలిడే బోనస్‌గా 650 డాలర్లు ఇస్తున్నట్లు ఆ మెయిల్లో ఉంది. బోనస్ అందుకోవడానికి ఉద్యోగులంతా వారి పర్సనల్ సమాచారాన్ని అందించాలని మెయిల్ లో సూచించారు. దీంతో ఉద్యోగులంతా వారి సమాచారాన్ని పంపించారు. అయితే రెండురోజులకు ఉద్యోగులకు సంస్థ ప్రధాన భద్రతాధికారి నుంచి ఓ మెయిల్ వచ్చింది.
బోనస్ అంటూ వచ్చిన ఆ మెయిల్ భద్రతా పరీక్ష(ఫిషింగ్ టెస్ట్‌లో) భాగమని ఆ మెయిల్ సారాంశం. అయితే ఉద్యోగులంతా ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యారని ఆ మెయిల్ లో స్పష్టం చేశారు. అయితే కంపెనీ తీరుపై సోషల్ మీడియా వేధికగా విమర్శలు వెల్లువెత్తాయి. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అనేక మంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సంస్థ క్షమాపణ చెప్పింది. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తమ ఉద్ధేశం కాదని స్పష్టం చేసింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.