• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • GOATS GIVING MILK TO COW CALF IN NIRMAL DISTRICT NS ADB

ఆవు దూడెకు పాలిచ్చి పెంచుతున్న మేకలు.. ఆశ్చర్యపరిచే ఈ వీడియో చూడండి

ఆవు దూడెకు పాలిచ్చి పెంచుతున్న మేకలు.. ఆశ్చర్యపరిచే ఈ వీడియో చూడండి

ఆవుదూడకు పాలు ఇస్తున్న మేక

మనుషుల కన్నా మిన్నగా తాము ప్రేమానురాగాలను పంచుతామని ఆ మూగ జీవాలు నిరుపిస్తున్నాయి. తల్లి చనిపోవడంతో ఇబ్బంది పడుతున్న లేగ దూడకు తన పాలను ఇచ్చి పెంచుతున్నాయి ఆ మేకలు.

  • Share this:
    మనుషుల కన్నా మిన్నగా తాము ప్రేమానురాగాలను పంచుతామని నిరుపిస్తున్నాయి ఆ మూగ జీవాలు. వేర్వేరు జాతులకు చెందిన వారమన్న విషయాన్ని సైతం మరిచి సఖ్యతతో మెదులుతున్నాయి. తల్లి చనిపోవడంతో ఇబ్బంది పడుతున్న లేగ దూడకు తన పాలను ఇచ్చి పెంచుతున్నాయి ఆ మేకలు. ఈ విషయం తెలుసుకున్న అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన వానకార్ శ్రీనివాస్ 20 ఏళ్లుగా మేకలు మందను పెంచుతూ జీవనం సాగిస్తునన్నాడు. అతడికి మేకల మందతో పాటు ఓ ఆవు కూడా ఉండేది. అయితే ఆ ఆవుకు లేగదూడ పుట్టిన తర్వాత అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో పాలు లేక ఇబ్బంది పడుతున్న ఆ ఆవుదూడకు తన మేకల మందలోని మేకల పాలను పట్టించడం అలవాటు చేశారు.

    సాధారణంగా జంతువులు ఇతర జాతులకు చెందిన జీవులకు పాలు ఇవ్వవు. దగ్గరకు వచ్చిన వెంటనే దూరంగా వెళ్లడం, తన్నడం లాంటివి చేస్తుంటాయి. అయితే ఆ మేకలు అలా చేయలేదు. ఆ లేగ దూడను సైతం తన పిల్లల లాగే భావించి పాలు ఇస్తున్నాయి. ఇలా రోజు పాలు తాగుతున్న ఆ ఆవు దూడ కొన్నాళ్లకు ఆ మేకల మందతో కలిసి మేతకు కూడా వెళ్లడం ప్రారంభించింది.

    ఆ మేకలు ఎటు వెళ్తే అటు వెళ్తుంది. అవి ఎటుపోతే అటు వాటితో కలిసిపోయి తిరుగుతుంది. దూడకు ఆకలి వేస్తే అరవగానే.. వెంటనే ఆ మేకలు అక్కడికి వస్తాయి. అది పాలు తగుతున్నంత సేపూ కదలకుండా అక్కడే ఉండి పోతాయి. అయితే ఆ లేగ మేకల మందతో మేతకు వస్తున్నా మేత మేయకుండా మేకల దగ్గరికి వచ్చి పాలు తాగుతుందని మేకల కాపరి చెబుతున్నాడు. మేకలలో మేకలాగా కలిసిపోయి ఆ మందలో తిరుగుతున్న దూడ ను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు