మేక చావు.. కంపెనీ అకౌంట్‌కి రూ.3కోట్ల చిల్లు పెట్టింది...

ఒడిశాలో మహానంది కోల్ ఫీల్డ్ లిమిటెడ్ బొగ్గు నిక్షేపాలను వెలికితీస్తుంది. బొగ్గు గనుల నుంచి రైల్వే వ్యాగన్లకు బొగ్గును సరఫరా చేసే ట్రక్కు ఢీకొన్ని ఈనెల 1న ఓ మేక చనిపోయింది.

news18-telugu
Updated: October 3, 2019, 3:31 PM IST
మేక చావు.. కంపెనీ అకౌంట్‌కి రూ.3కోట్ల చిల్లు పెట్టింది...
మేక (నమూనా చిత్రం)
  • Share this:
ఓ మేక చనిపోతే ఎంత నష్టం వస్తుంది? మహా అయితే, రూ.5వేలు లేదా రూ.10వేలు వస్తుంది. కొంచెం ఖరీదైన మేక అయితే, ఓ లక్ష రూపాయల నష్టం వస్తుంది. అయితే, ఓ మేక చనిపోతే ఆ కంపెనీకి అక్షరాలా రూ.3 కోట్ల నష్టం వాటిల్లింది. ఇది ఎక్కడో విదేశాల్లో కాదు. భారత్‌లోనే. ఒడిశా రాష్ట్రంలో. ఒడిశాలో మహానంది కోల్ ఫీల్డ్ లిమిటెడ్ బొగ్గు నిక్షేపాలను వెలికితీస్తుంది. బొగ్గు గనుల నుంచి రైల్వే వ్యాగన్లకు బొగ్గును సరఫరా చేసే ట్రక్కు ఢీకొన్ని ఈనెల 1న ఓ మేక చనిపోయింది. ఈనెల 1న ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో చనిపోయిన మేకకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మేకకు రూ.60వేలు నష్టపరిహారం అడిగారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. ఈ వివాదం మొత్తం సద్దుమణగడానికి మధ్యాహ్నం 2.30 అయింది. అయితే, ఈ మూడున్నర గంటల పాటు బొగ్గు రవాణా నిలిచిపోవడం వల్ల కంపెనీకి రూ.1.4 కోట్లు నష్టం వచ్చింది. రవాణా ఆలస్యం కావడం వల్ల రైల్వేకి రూ.1.28 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. దీంతోపాటు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల రూ.46 లక్షల నష్టం వచ్చింది. బొగ్గు ఉత్పత్తి, రవాణాకు విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంపెనీ ఫిర్యాదు చేసింది.
First published: October 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading