Home /News /trending /

ఈ మేక పేరు ‘మోదీ’, ఆ తర్వాత కథ చదవండి.. మరీ టూమచ్ అంటారు

ఈ మేక పేరు ‘మోదీ’, ఆ తర్వాత కథ చదవండి.. మరీ టూమచ్ అంటారు

ఈ మేక పేరు ‘మోదీ’ (Image:Mumbaimirror)

ఈ మేక పేరు ‘మోదీ’ (Image:Mumbaimirror)

Goat named ‘Modi’: మహారాష్ట్రలోని అట్పాడిలో ఉన్న సంతకు ఓ యజమానికి కొన్ని మేకలను తీసుకొచ్చాడు. అందులో ఓ మేక జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. దానికి రెండు కారణాలు ఉన్నాయి.

    మేకల ధరలు లక్షలు పలుకుతాయంటే ఎవరైనా నమ్ముతారా? అస్సలు నమ్మరు. ఎంత జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులు పెట్టి పెంచినా కూడా లక్షలు పెట్టి ఎవరు కొంటారు చెప్పండి. అయితే, మీరు ఇప్పుడు చదవబోయే స్టోరీ మిమ్మల్ని కచ్చితంగా షాక్‌కి గురి చేస్తుంది. కరోనా వైరస్ కారణంగా పశువుల సంతలు నిర్వహించడం లేదు. ప్రస్తుతం కొంచెం సద్దుమణిగినట్టు కనిపించడంతో మళ్లీ మేకల సంతలు మొదలయ్యాయి. మహారాష్ట్రలోని అట్పాడి‌లో ఇలాంటి సంత ఒకటి ఉంది. కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ భారీ సంత జరుగుతుంది. పశువులను కొనడానికి ప్రజలు కూడా ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో అట్పాడిలో ఉన్న సంతకు ఓ యజమానికి కొన్ని మేకలను తీసుకొచ్చాడు. అందులో ఓ మేక జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఆ మేక చూడడానికి మామూలువాటిలా లేదు. కొద్దిగా వెరైటీగా ఉంది. అలాగే, మరో ముఖ్యకారణం దాని పేరు. దాని పేరు ‘మోదీ.’

    Health Tips: మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరిచే 7 ఉత్తమ మార్గాలు

    గ్రానైట్‌లా తళతళలాడేవాడు.. ఆమెపై వ్యామోహం.. అతణ్ని చంపేసింది.. ఖమ్మం జిల్లాలో క్రైం కహానీ 

    సంగోలా తాలూకాలోని చందోల్‌వాడీకి చెందిన బాబూరావు మేట్కారీ ఈ మేకను తీసుకుని వచ్చాడు. ఆ మేకను ఓ వ్యక్తి రూ.70 లక్షలు ఇచ్చి కొనడానికి రెడీ అయ్యాడు. ఆ విషయం తెలిసిన ఇతర వ్యాపారులు అందరూ షాక్‌కి గురయ్యారు. బాబూరావు మేట్కారీ పంట పండిందనుకున్నారు. ఒక్క మేక అతడి లైఫ్‌ను మార్చేసిందని ఆనందించారు. కానీ, వారందరీకి షాక్ ఇచ్చాడు బాబూరావు మేట్కారీ. తన మేకను ఇవ్వాలంటే రూ.1.5 కోట్లు కావాలని డిమాండ్ చేశాడు. అంత ధర ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ మేక అమ్ముడు పోలేదు. అయినా కూడా అతడు నిరుత్సాహపడకుండా దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. తాను అడిగిన రేటు వస్తేనే అమ్ముతానని ప్రకటించాడు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Maharashtra, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు