ఇరుకు గొయ్యిలో పడిన మేక... ప్రాణాలకు తెగించి కాపాడిన కుర్రాళ్లు...

బోరు బావిలో చిన్నారి పడితే మనం ఎంతలా ఆందోళన చెందుతామో... సరిగ్గా అలాగే... ఆ మేక విషయంలో వాళ్లు ఆందోళన చెందారు. దాన్ని కాపాడిన తీరు అందరిచేతా ప్రశంసలు అందిస్తోంది.

news18-telugu
Updated: June 29, 2020, 11:56 AM IST
ఇరుకు గొయ్యిలో పడిన మేక... ప్రాణాలకు తెగించి కాపాడిన కుర్రాళ్లు...
ఇరుకు గొయ్యిలో పడిన మేక... ప్రాణాలకు తెగించి కాపాడిన కుర్రాళ్లు... (credit - twitter)
  • Share this:
అసోం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) హర్దీ సింగ్... ఓ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అందులో ఘటన ఎప్పుడో జరిగినా... ఇప్పుడు పోస్ట్ చెయ్యడంతో... అది వైరల్ అయ్యింది. అందులో... ఓ మేక ఇరుగు గొట్టం లాంటి గొయ్యిలో పడింది. బయటకు రాలేక ప్రాణభయంతో కేకలు పెట్టింది. అటుగా వెళ్తున్న కొందరు కుర్రాళ్లు ఆ కేకలు విన్నారు. గొయ్యి దగ్గరకు వచ్చారు. అది మేక అని అర్థమైంది. కానీ దాన్ని ఎలా బయటకు తియ్యాలో తెలియలేదు. ఆ గొయ్యి చూస్తే... గొట్టంలా చాలా చిన్నగా ఉంది. ఓ కుర్రాడు... టవల్ తీసి... లోపలకు పంపితే... అన్నాడు. మిగతావాళ్లు... "అరేయ్... టవల్ పట్టుకోవడానికి అదేమైనా మనిషేంట్రా... మేక" అంటూ నవ్వారు.

కానీ ఆ కుర్రాడు పట్టుదలతో ఉన్నాడు. ఏం చేసైనా మనం ఆ మేకను బయటకు తియ్యాలి అన్నాడు. మిగతా వాళ్లు... అవును... తియ్యాలి. కానీ ఎలా కనీసం మనుషులు దూరే ఛాన్స్ కూడా లేనంత చిన్నగా గొయ్యి ఉందే అన్నారు. నేను దూరుతా అంటూ ఆ కుర్రాడు గొయ్యిలో తల పెడుతుంటే... సరే జాగ్రత్త అంటూ మిగతా వాళ్లు అతని రెండు కాళ్లను పట్టుకొని పైకి లేపుతూ... జాగ్రత్తగా అతన్ని లోపలికి వెళ్లనిచ్చారు. దాదాపు అతను పూర్తిగా లోపలకు వెళ్లిపోయాడు. అప్పుడు అతనికి కొన్ని క్షణాలపాటూ... మేక దొరకలేదు.

చివరకు ఎలాగొలా మేక తలను పట్టుకున్నాడు. నన్ను లాగండి అనడంతో... పైన ఉన్న వాళ్లు వేగంగా అతన్ని పైకి లాగారు. అలా... మేక తలను పట్టుకొని పైకి వచ్చిన అతను వెంటనే మేకను నేలపై వదిలాడు... అది ఎంతో ఆనందపడుతూ... అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఓ మంచి పని చేసిన వాళ్లంతా తమను తాము మెచ్చుకున్నారు.


ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా లక్ష మందికి పైగా దీన్ని చూశారు. వేల కొద్దీ లైక్స్ వస్తున్నాయి. అందరూ దీన్ని చూసి... శభాష్ అని వాళ్లను మెచ్చుకుంటున్నారు. ఎంతో పట్టుదలతో సాధించారని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇది జరిగింది కర్ణాటకలో కావడంతో... ఇలాంటి తెరచివుంచిన గోతులను పూడ్చేయమని కర్ణాటక డీజీపీకి ట్యాక్ చేశారు హర్దీ సింగ్. ఆ కుర్రాళ్ల సాహసాన్ని ఆయన కూడా మెచ్చుకున్నారు.
First published: June 29, 2020, 11:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading