జంతువులకు ఆహారపు అలవాట్లు పుట్టుకతోనే వస్తాయి. అందుకే కొన్ని క్రూరమృగాలు, మరికొన్ని సాధు జంతువులుగా వాటికి అనుకూలమైన వాతావరణంలో జీవిస్తుంటాయి. కానీ ప్యూర్ వెజిటేరియన్ యానిమల్..నాన్ వెజ్ లవర్‌గా మారిపోయింది. మధ్యప్రదేశ్(madhya pradesh)లో ఈ వింత ఘటన జరిగింది. మధ్యప్రదేశ్(madhya pradesh)లోని దేవాస్ టౌన్‌కి దగ్గర లోహరి అనే గ్రామం ఉంది. అక్కడ పశువులు పెంచుకుంటున్న ఓ రైతు దగ్గరున్న మేకల మందలో ఓ మేకకు ఆకులు, అలమలు, కాయల్ని గ్రాసంగా కాకుండా ప్రతి రోజు చికెన్ బిర్యానీ(chicken biryani)పెట్టి మేపుతున్నాడు. మేకేంటి కోడి మాంసం తినడం ఏమిటని ఆశ్చర్యపోకండి. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా మొదటగా షాకయ్యారు. అసలు ఈ వార్త నిజమేనా ? లేక పుకార్లా ? తెలుసుకునేందుకు లోహరి గ్రామానికి వెళ్లి మరీ చూసి కన్ఫామ్ చేసుకున్నారు. రైతు రఫీఖ్ (rafiq)పెంచుతున్న మేక పేరు భూరి. దానికి ఒక్క చికెన్ బిర్యానే (chicken biryani)కాదు..మాంసాహారం ఏదైనా కోడి, చేప, గుడ్లు (fish eggs)దేన్ని వదలకుండా లాగిస్తోంది. తన దగ్గరున్న మేకల మందలో ఇదొకటి. కానీ మూడేళ్ల క్రితం తన పొలంలో పుట్టింది కాబట్టే దానికి ఇష్టమైన చికెన్ బిర్యానీ పెడుతూ పెంచుతున్నానని వచ్చిన వారికి చెబుతున్నాడు రైతు రఫీఖ్.
మూడేళ్లుగా మాంసం తింటున్న మేక..
మధ్యప్రదేశ్‌కి చెందిన ఈ మేక ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకున్న నెటిజన్లు కూడా వింతగానే స్పందిస్తున్నారు. గతంలో కూడా ఓ మేక చేపను నోట్లో కరుచుకొని మింగేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది. అది కూడా కావాలనే చేపను మింగేసిందా లేక కాకతాళీయంగా వేరే పదార్ధం అనుకొని మింగేసి ఉంటుందన్న చర్చ జోరుగా జరిగింది. కానీ ఇప్పుడు భూరి అనే మేక పక్కా మాంసాహారిగా మారి తీరు చూసి కలియుగంలో జరుగుతున్న వింతల్లో ఇదొకటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. మార్కెట్‌లో అమ్మితే వేల రూపాయలు పలికే మేక కోసం ఇలా రోజు వందల రూపాయల ఖర్చు చేసి పోషిస్తున్న రైతు రఫీఖ్ చాలా గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు.
చికెన్ బిర్యానీ అంటే భూరికి ఇష్టం..
మాంసాహార జంతువులు ఆకలైతే శాఖాహారం తింటాయి. కానీ వెజిటేరియన్ యానిమల్స్ మాత్రం ఎంత ఆకలైనా మాంసం తినవు అనే నానుడి ఉంది. మరీ మధ్యప్రదేశ్‌లో డైలీ చికెన్ బిర్యానీ తిని బతికేస్తున్న భూరి అనే మేక ఆహార అలవాటు ఎందుకు ఇలా మారింది. మాంసం తింటున్న మేకకు ఎలాంటి జబ్బులు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందో జంతుశాస్త్ర నిపుణులు, వెటర్నరీ డాక్టర్లు తేల్చాల్సి ఉంది. సాధుజీవాలుగా పేరున్న మేకలే చికెన్, చేప, గుడ్లు తింటే ఇక మనుషులకు మాంసాహారం ఎక్కడ దొరుకుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chicken, Chicken biryani, Madhra pradesh