Home /News /trending /

GOAT BORN IN PAKISTAN WITH THE LONGEST EARS 19 INCH EARS SWAYING ON THE GROUND WHEN IT WALKS SK

Viral Story: ఈ మేక పిల్ల చెవులు చీపురు కట్టంత పొడవు.. నడుచుకుంటూ వెళ్తే చాలు.. ఊడ్చినట్లే

పొడవైన చెవులు కలిగిన మేక

పొడవైన చెవులు కలిగిన మేక

Long ears Goat: పాకిస్తాన్‌లో ఓ మేక వింతగా ఉంది. ఇతర మేకలతో పోల్చితే.. అది చాలా భిన్నంగా ఉంది. పొడవాటి చెవులతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

    ఈ భూమండలంలో ఎన్నో వింతలు విశేషాలు దాగుతున్నాయి. ప్రకృతితో పాటు మనుషుల విషయంలో కూడా అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఆరువేళ్లతో పిల్లలు జన్మించడం.. ఆవుకు ఐదు కాళ్లు ఉండడం.. కుక్క పాలను పిల్లి తాగడంఇలాంటి టీవీలు పేపర్లలో చాలాసార్లు చూశాం. ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఒకే రకమైన శరీర భాగాలతో పుడతాడు. కొన్నిసార్లు మాత్రం విభిన్నంగా జరుగుతుంటుంది. జన్యు మార్పులు, శారీరక రుగ్మతల కారణంగా మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకే నలుగురితో పోల్చితే వారు భిన్నంగా ఉంటారు. వింతగా కనిపిస్తారు. మనుషులే కాదు.. జంతువులకు కూడా ఇది వర్తిస్తుంది. పాకిస్తాన్‌లో ఓ మేక కూడా వింతగా ఉంది. ఇతర మేకలతో పోల్చితే.. అది  చాలా భిన్నంగా ఉంది. పొడవాటి చెవులతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

    వధువు కావలెను.. ఇది పేపర్‌ ప్రకటన కాదు.. ఏకంగా గోడలపై కనిపించిన పోస్టర్.. ఎక్కడంటే..

    సింధ్‌ ప్రావిన్స్‌కు చెందిన మహమ్మద్ హసన్ అనే వ్యక్తి.. ఆవులు, మేకలను పెంచుకుంటున్నాడు. ఐతే తన ఫామ్‌లోని ఓ మేకపిల్ల మాత్రం వింతగా ఉంది. అది పుట్టి కేవలం 18 రోజులే అయింది. సాధారణంగా మేకల చెవులు చాలా చిన్నగా ఉంటాయి. కానీ ఈ మేక పిల్ల మాత్రం అత్యంత పొడవైన చెవులతో పుట్టింది. దాని పేరు సింబా. ఈ మేక పిల్ల చెవులు 19 అంగుళాల పొడవు ఉన్నాయి. సాధారణం కంటే చాలా ఎక్కువ. సింబా చెవులు దాని కాళ్ల కంటే పొడవుగా ఉన్నాయి. అది నడుచుకుంటూ వెళ్తే.. చెవులు నేలకు రాసుకుంటూ వెళ్తాయి . అంటే నేలను ఊడ్చుకుంటూ వెళ్తాయన్న మాట. చీపురులాంటి చెవులతో ఉన్న ఈ మేక పిల్ల స్థానికంగా ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది. దానిని చూసేందుకు చుట్టుపక్కల నుంచి ఎంతో మంది వస్తుంటారు.



    జూన్ 5న సింబా జన్మించింది. ఇప్పటికే దాని చెవుల పొడవు 19 అంగుళాలు దాటిపోయింది. అది నేలపై నడచుకుంటూ వెళ్తున్నప్పుడు.. చెవులు నేలకు రాసుకుంటు వెళ్తాయి. ఆ సమమంలో మహమ్మద్ హసన్ కుటుంబ సభ్యులు దాని చెవులను పైకి ఎత్తి పట్టుకుంటారు. వయసు పెరిగే కొద్దీ.. సింబా చెవులు మరింతగా పెరుగుతాయని మహమ్మద్ హసన్ చెబుతున్నాడు. పెద్దయ్యాక... దాని చెవుల పొడవు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే వరకు ఉంటుందని భావిస్తున్నాడు. సింబా నుబియన్ జాతి మేక అని... ఇది పొడవాటి చెవులకు ప్రసిద్ధి చెందిన జాతి మహమ్మద్ హసన్ తెలిపారు. నుబియన్ ప్రమాణాల కంటే కూడా.. దీని చెవులు చాలా పొడవుగా ఉన్నాయని.. ఇది జన్యు పరివర్తన ప్రభావం కావచ్చని పేర్కొన్నారు.

    వాటర్ మిలన్ లో వేయించిన పాప్ కార్న్.. ఇలాంటి వీడియోను ఎప్పుడు చూసుండరు..



    ఈ ఏడాదిలో ఓ కుక్క తన పొడవైన చెవులతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. అమెరికాలోని ఒరెగాన్‌కి చెందిన డాగీ పేరు లౌ మిల్వాకీ. లౌ అనేది నలుపు, టోన్డ్ కూన్‌హౌండ్ జాతి. ఈ కుక్క చెవులు 34 సెం.మీ పొడవు ఉన్నాయి. దానిలాగే సింబా మేక కూడా వరల్ రికార్డు సాధిస్తుందని దాని యజమాని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: International, Pakistan, Trending, Viral story

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు