‘సిగరెట్టు పీకలు, బాటిల్ మూతలకు బీర్లు ఇస్తాం...’
గోవా బీచ్‌లో బహిరంగంగా బీరు తాగితే మీకు రూ.2000 జరిమానా వేస్తారు. అదే బీరు బాటిల్ మూతలు, సిగరెట్ ముక్కలను క్లీన్ చేస్తే మీకో ఫ్రీ బీరు లభిస్తుంది.
news18-telugu
Updated: February 9, 2019, 6:45 AM IST
news18-telugu
Updated: February 9, 2019, 6:45 AM IST
చేతిలో బీరు.. ఎదురుగా సముద్రం.. ఆహా! ఇలాంటి సీన్ ఎంజాయ్ చేయాలంటే గోవా వెళ్లాల్సిందే అనుకుంటారు. అయితే, ఆ బీరు ఫ్రీగా వస్తే ఆ కిక్కే వేరు కదా. అయితే, మీరు గోవా వెళ్లినప్పుడు కచ్చితంగా ఈ ఆఫర్ పొందొచ్చు. ఎందుకంటే, గోవాలోని ఓ బీచ్‌లో ఇలాంటి ఆఫర్ ఇచ్చారు. బీచ్‌లో ఎలాంటి చెత్తా చెదారం పడేయకుండా, క్లీన్‌గా ఉంచడానికి ఈ ప్లాన్ వేశారు. తాగి పడేసిన సిగరెట్ ముక్కలు, ఖాళీ అయిన బీరు బాటిళ్లు, వాటి మూతలు, ప్లాస్టిక్ స్ట్రాలు వంటి చెత్తను తీసుకెళ్లి ఇస్తే, ఎంచక్కా మీకో బీరు ఫ్రీగా వస్తుంది. గోవాలోని ‘బాగా’ బీచ్‌లో ఈ కొత్త స్కీమ్ ఏర్పాటైంది. జనవరి 30 నుంచి ఈ ‘వేస్ట్ బార్’ అందుబాటులోకి వచ్చింది. పది బీర్ బాటిల్ మూతలు లేదా 20 సిగరెట్ పీకలు ఇస్తే ఫ్రీ బీరు ఇస్తారు. జనం కూడా సరదాగా ఖాళీ బీరు బాటిళ్లు, మూతలు ఇచ్చి ఎంచక్కా ఫ్రీ బీరు తీసుకుంటున్నారు.

‘వేస్ట్ బార్’ కాన్సెప్ట్ సూపర్ క్లిక్ అయింది. గత ఏడాదిలో కూడా ఇలాంటిది ఏర్పాటు చేశారు. అప్పుడు సుమారు 5 నెలల పాటు నడిపించారు. ఇప్పుడు మళ్లీ ఏర్పాటు చేశారు. దీన్ని ఒక్క బీచ్‌కే పరిమితం కాకుండా మిగిలిన బీచ్‌లకు కూడా విస్తరించే ప్లాన్‌లో ఉన్నారు.
ఇంకో విషయం ఏంటంటే, గోవా బీచ్‌లో బహిరంగంగా మద్యం తాగితే రూ.2000 ఫైన్ వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అలాంటి బిల్లును తీసుకొచ్చింది. అయితే, అసలు గోవాకి వచ్చేదే అలలతో ఆడుకుంటూ బీచ్‌లో బీరుకొడుతూ ఎంజాయ్ చేయడానికైతే, ఇలా కండిషన్లు పెడితే టూరిస్టులు ఎలా వస్తారంటూ మరికొందరు ప్రశ్నించారు.
అటు ప్రభుత్వం కండిషన్లు, ఇటు టూరిస్టుల అవస్థలకు రెండింటికీ మధ్య ఈ ‘వేస్ట్ బార్’ కాన్సెప్ట్ బాగానే క్లిక్ అవుతోంది. ఇటీవలే, యూపీలో జరుగుతున్న కుంభమేళాలో కూడా ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి ప్రవేశపెట్టారు. అయితే, అక్కడ చెత్త ఇస్తే, టీ ఇస్తారు.

గోవా బీచ్‌లో ఏర్పాటు చేసిన వేస్ట్ బార్
‘వేస్ట్ బార్’ కాన్సెప్ట్ సూపర్ క్లిక్ అయింది. గత ఏడాదిలో కూడా ఇలాంటిది ఏర్పాటు చేశారు. అప్పుడు సుమారు 5 నెలల పాటు నడిపించారు. ఇప్పుడు మళ్లీ ఏర్పాటు చేశారు. దీన్ని ఒక్క బీచ్‌కే పరిమితం కాకుండా మిగిలిన బీచ్‌లకు కూడా విస్తరించే ప్లాన్‌లో ఉన్నారు.

బీరు బాటిల్ మూతలు, సిగరెట్ ముక్కలు
గోవాకు ప్రత్యేక హోదా.. మేనిఫెస్టోలో పెడుతామన్న బీజేపీ
బుర్ఖా ధరించి లేడీస్ టాయిలెట్లోకి.. పోలీసుల అదుపులో నిందితుడు
హై జోష్‌లో గోవా సీఎం.. ముక్కులో పైపుతోనే బడ్జెట్ ప్రవేశపెట్టిన పారికర్
‘ఇంత దిగజారాలా?’: రాహుల్ గాంధీకి మనోహర్ పారికర్ లేఖాస్త్రం
గోవా వెళ్లే మందుబాబులకు హెచ్చరిక.. బీచ్‌లో బీర్ కొడితే...
ఇంకో విషయం ఏంటంటే, గోవా బీచ్‌లో బహిరంగంగా మద్యం తాగితే రూ.2000 ఫైన్ వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అలాంటి బిల్లును తీసుకొచ్చింది. అయితే, అసలు గోవాకి వచ్చేదే అలలతో ఆడుకుంటూ బీచ్‌లో బీరుకొడుతూ ఎంజాయ్ చేయడానికైతే, ఇలా కండిషన్లు పెడితే టూరిస్టులు ఎలా వస్తారంటూ మరికొందరు ప్రశ్నించారు.

బీర్ బాటిల్ మూతలు, సిగరెట్ ముక్కలకు బీర్ ఇస్తున్న వేస్ట్ బార్ నిర్వాహకులు
Loading....
Loading...