• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • GOA BASED STARTUP HAS LAUNCHED ITS FIRST ELECTRIC MOTORCYCLES CALLED KABIRA MOBILITY THE KM 3000 AND KM 4000 IN INDIA SSR GH

Kabira Mobility: దేశంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ లాంచ్‌కు అంతా సిద్ధం.. ఎప్పుడు కొనుక్కోవచ్చంటే...

Kabira Mobility: దేశంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ లాంచ్‌కు అంతా సిద్ధం.. ఎప్పుడు కొనుక్కోవచ్చంటే...

ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్

Goa based startup has launched its first electric motorcycles called Kabira Mobility the KM 3000 and KM 4000 in India దేశంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ లాంచ్‌కు అంతా సిద్ధం.. ఎప్పుడు కొనుక్కోవచ్చంటే...

  • Share this:
గోవాకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ కబీరా మొబిలిటీ KM3000, KM4000 అనే రెండు కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది. 6000W గరిష్ట శక్తి గల KM3000 ధర రూ. 1,26,990 (ఎక్స్-షోరూమ్, గోవా) కాగా, 8000W గరిష్ట శక్తి గల KM4000 ధర రూ.1,36,990 (ఎక్స్-షోరూమ్, గోవా)గా నిర్ణయించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ బుకింగ్స్ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభమవుతుండగా, డెలివరీలు మాత్రం మే నెల నుండి ప్రారంభమవుతాయని కబీరా మొబిలిటీ స్పష్టం చేసింది.

ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్ లను తొలుత ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, పూణె, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గోవా, ధార్వాడ్ వంటి తొమ్మిది నగరాల్లో మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత దేశమంతటా విస్తరించనున్నారు. KM3000 స్పోర్ట్స్ బైక్ 138 కిలోల బరువును కలిగి ఉంటుంది. అదేవిధంగా, KM4000 స్పోర్ట్స్ బైక్ 147 కిలోల బరువు కలిగి ఉంటుంది. KM3000, KM4000లను ఎకో, బూస్ట్ అనే రెండు మోడ్‌లలో ఛార్జ్ చేయవచ్చు. ఎకో మోడ్‌లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 గంటల 30 నిమిషాలు పడుతుంది. బూస్ట్ మోడ్లో 80% బ్యాటరీని కేవలం 50 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఈ బైక్‌లలో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్, ఆన్‌బోర్డ్, రోడ్‌సైడ్ అసిస్టెంట్, పార్క్ అసిస్ట్ వంటి సర్వీస్ లు, స్మార్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు గంటకు 120 కిలో మీటర్ల వేగంతో 150 కిలోమీటర్ల వరకూ నడుస్తాయి.

ఈ రెండు బైక్‌లు నూతన సాంకేతిక పరిజ్ఞానం, స్టైలింగ్‌తో అద్భుతంగా రూపొందించబడ్డాయి. ఎలక్ట్రిక్ బైక్ పోర్ట్ ఫోలియోలో మరిన్ని బైక్ లను పరిచయం చేయడం ద్వారా తమ పరిధిని మరింతగా విస్తరించుకోవాలని కబీరా మొబిలిటీ యోచిస్తోంది. కాగా, నూతన ఎలక్ట్రిక్ బైక్ ల గురించి కబీరా మొబిలిటీ సిఈఓ జైబీర్ ఎస్. సివాచ్ మాట్లాడుతూ ‘‘నేటి యువత అభిరుచికి తగ్గట్లుగా, పర్యావరణానికి ఎటువంటి నష్టం కలిగించకుండా ఈ రెండు హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ లను రూపొందించాం. అందువల్ల, భారత మార్కెట్లో ఈ బైక్‌లకు గణనీయమైన డిమాండ్ ఏర్పడుతుందని ఆశిస్తున్నాం” అని అన్నారు.
Published by:Sambasiva Reddy
First published: