Magic Show: టిక్‌టాక్ అమ్మాయిల మ్యాజిక్ షో... వైరల్ వీడియోని మళ్లీ మళ్లీ చూస్తున్నారుగా

Magic Show: మీకు మ్యాజిక్ చెయ్యాలని ఉందా... దాని కోసం మీరు ఏ ట్రిక్కులూ నేర్చుకోవాల్సిన పని లేదు. ఈ వీడియో చూశారంటే చాలు... చేసేస్తారు.

news18-telugu
Updated: November 15, 2020, 2:28 PM IST
Magic Show: టిక్‌టాక్ అమ్మాయిల మ్యాజిక్ షో... వైరల్ వీడియోని మళ్లీ మళ్లీ చూస్తున్నారుగా
టిక్‌టాక్ అమ్మాయిల మ్యాజిక్ షో (credit - twitter)
  • Share this:
ఇంటర్నె్ట్ ఓ అద్భుతమైన విజ్ఞాన భాండాగారం. అక్కడ ప్రతి ఒక్కరూ తమ టాలెంట్‌ను ప్రపంచానికి చూపించొచ్చు. వ్లాగర్లు, బ్లాగర్లు, టిక్‌టాక్ యూజర్లు, యూట్యూబర్లు... ఇలా ఎవరైనా ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకోవచ్చు. టిక్‌టాక్‌లో ఓ అమ్మాయిల గ్రూప్ అదే చేసింది. జస్ట్ 12 సెకండ్ల లోపే ముగిసే ఆ వీడియోలో... వాళ్లు అద్భుతంగా మ్యాజిక్ చేయడమే కాదు... అదిరిపోయే ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరు మళ్లీ మళ్లీ ఆ వీడియో చూసేలా చేస్తున్నారు. ప్రధానంగా వారు పెట్టే హావభావాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇందులో వాళ్లు ఏ మాటలూ లేవు, ఇమిటేషన్లూ లేవు. ఈ వీడియో చూశాక... నెటిజన్లే మాట్లాడుతున్నారు. నలుగురు అమ్మాయిలు కలిసి చేసిన ఈ మ్యాజిక్ షో... సోషల్ మీడియాలో నిజంగానే మ్యాజిక్ చేస్తోంది.

వాళ్లు చేసినది చూసి... ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు. భలే చేశారే అనుకుంటున్నారు. శనివారం ట్విట్టర్‌లో వేసిన ఈ వీడియోని... ఇప్పటికే 83వేల మంది చూశారు. లైక్సూ, కామెంట్సూ తుఫానులా వస్తున్నాయి. రాజకీయ నాయకులు ప్రజలను ఎలా మోసం చేస్తారో... ఈ వీడియోని చూస్తే అర్థమవుతుందని కొందరు కామెంట్స్ రాస్తున్నారు. మరికొందరు... క్రియేటివ్ గా ఉందని మెచ్చుకుంటున్నారు.



చైనాకి చెందిన బైట్ డాన్స్ కంపెనీ... ఈ టిక్ టాక్ యాప్ తెచ్చింది. దీని ద్వారా చాలా మంది టిక్ టాక్ స్టార్లుగా గుర్తింపు పొందారు. కొందరు డాన్సులు బాగా చేశారు, కొందరు పాటలు పాడారు, ఇంకొదరు ఆర్ట్స్ వేశారు... ఇలా ఎవరి టాలెంట్ వారు చూపించారు. ఐతే... ఇండియా, చైనా మధ్య సరిహద్దు వివాదం తర్వాత... చైనాకి చెందిన యాప్స్ ని భారత్ నిషేధించింది. అందులో టిక్ టాక్ కూడా ఉంది. ఐతే... భారత ప్రభుత్వం కక్ష పూరితంగా ఈ నిర్ణయం తీసుకోలేదు. టిక్ టాక్ సర్వర్లు చైనాలో ఉండటంతో... రూల్స్ కి విరుద్ధం కాబట్టి... కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.



ఇది కూడా చదవండి:  బ్యూటీపార్లర్‌కి వెళ్లి ప్రియుడితో గడిపిన భార్య... భర్త ప్రశ్నించేసరికి ఏం చేసిందంటే...

టిక్ టాక్ పోర్నోగ్రఫీని ప్రోత్సహిస్తోందన్న విమర్శలూ ఉన్నాయి. దేశీయ సంప్రదాయాలు, ఆచారాలను పక్కదారి పట్టించి... యువతను చెడగొడుతోందనే ఆరోపణలను టిక్ టాక్ ఎదుర్కొంది. ఈ యాప్ ని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని ఒడిశా హైకోర్టు తెలిపింది. టిక్ టాక్ అమల్లో ఉన్న దేశాల్లో ప్రజలు దీన్ని వాడుకుంటూ... తమ టాలెంట్ చూపిస్తున్నారు. ఇండియాలో టిక్ టాక్ లాంటివే చింగారి, రోపోసో లాంటి యాప్ లు ఆల్టర్నేట్ గా ఉపయోగపడుతున్నాయి.
Published by: Krishna Kumar N
First published: November 15, 2020, 2:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading