• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • GIRL TRY TO COMMIT SUICIDE AT METRO STATION IN FARIDABAD SECTOR 28 WATCH VIDEO SU

మెట్రో స్టేషన్‌ పైనుంచి కిందకు దూకాలని చూసిన యువతి.. వైరల్‌గా మారిన Video.. అసలు ఏం జరిగిందంటే..

(Image-Twitter)

ఓ యువతి మెట్రో స్టేషన్ బాల్కనీపైకి ఎక్కి.. కిందకు దూకాలని చూసింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

  • Share this:
    ఓ యువతి మెట్రో స్టేషన్ బాల్కనీపైకి ఎక్కి.. కిందకు దూకాలని చూసింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కొందరు వ్యక్తులు తమ ఫోన్లలో రికార్డు చేశారు. అయితే పోలీసులు, అక్కడున్నవారు సకాలంలో స్పందించి.. యువతి ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలోని సెక్టార్‌ 28లో ఉన్న మెట్రో స్టేషన్ వద్ద జరిగింది. వివరాలు.. యువతి, ఆమె ప్రియుడు ఇద్దరు ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. యువతి ప్రస్తుతం ఢిల్లీలోని నివాసం ఉంటుంది. అయితే ప్రియుడితో గొడవపడిన యువతి.. కోపంతో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే సెక్టార్ 28లో ఉన్న మెట్రో స్టేషన్‌కు వచ్చి బాల్కనీపైకి చేరింది.

    ఇది గమనించిన తోటి ప్రయాణికులు మెట్రో సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించారు. గోడ దూకి యువతి ఉన్న చోటుకి చేరుకున్నారు. ఆమెను రక్షించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే యువతి చర్యతో.. కింద రోడ్డుపై వెళ్తున్నవారు ఆమెను చూస్తుండిపోయారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.





    మరోవైపు పోలీసు సిబ్బంది యువతి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. యువతికి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం వారితో పంపించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువతిని రక్షించిన సిబ్బందిపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: