Video Viral: అమ్మాయి ఒడిలో నిద్రపోతున్న భారీ కొండ చిలువ.. ఆ వీడియోను మీరూ చూడండి..

ఆ బాలిక ఒడిలో కొండచిలువ

Video Viral: సాధారణంగా మనం పాములను చూస్తేనే ఆమడ దూరం వెళ్తాం. కానీ ఆక్కడ ఓ అమ్మాయి తన ఒడిలో భారీ కొండచిలువను పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాలిలా ఉన్నాయి.

  • Share this:
    ఎవరికైనా పాము(Snake)ను చూసినప్పుడు ఆమడ దూరం వెళ్తారు. మరో రోజు అటువైపు అలా వెళ్లాలంటేనే భయపడిపోతుంటారు. పాము చిన్నదైనా, పెద్దదైనా ప్రజలు భయపడతారు. పాము దగ్గరకు వాళ్లు రాకుండా.. అటు వైపు వెళ్లకండా జాగ్రత్త పడుతుంటారు. అయితే కొంతమంది పాములను కూడా పెంచుకుంటారన్న విషయం తెలిసిందే. ఇలా పాములను పెంచుకునే వాళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ పాముల తదుపరి కదలికలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. అయితే ఇలాంటిది ఓ అమ్మాయి పామును పెంచుకుంటుంది. అది మామూలు పాము కాదు.. భారీ కొడచిలువ. ఆ అమ్మాయి ఒడిలో ఆ పాము ఉండటం మనం కింద ఇచ్చిన  వీడియోలో గమనించవచ్చు.

    Viral News: మద్యం సేవించి తనకు తానే వెతుకున్నాడు.. ఈ ఘటన ప్రతీ ఒక్కరికి నవ్వు తెప్పిస్తోంది..


    ఆ కొండచిలువ తలను పట్టుకొని ఆ బాలిక ఉండటం మనం చూడవచ్చు. దీనిని చూసిన నెటిజన్లు భయంతో.. ఆశ్చర్యపోతున్నారు. ఎలాంటి భయం లేకుండా.. ఒక చేత్తో మొబైల్ ఆపరేట్ చేసుకుంటూ.. మరో చేత్తో కొండచిలువను తడుముతూ కనిపించింది ఆ మహిళ. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలిక తన ఇంటి వెలుపల కూర్చొని కనిపించింది. ఆ పాము ఇంటి ప్రాంగణంలో బహిరంగ ప్రదేశంలో పాకుతూ కనిపించింది ఆ భారీ కొండ చిలువ.  వైరల్ అవుతున్న ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో యువర్ నేచర్‌గ్రామ్ అనే అకౌంట్‌లో షేర్ చేయబడింది.



    Alcohol Museum: ఆ మ్యూజియం మొత్తం ఆల్కహాలే.. ఎక్కడ లాంచ్ చేశారో తెలుసా..


    ఇది సెప్టెంబర్ 18న సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 1.3 మిలియన్ మంది వీక్షించారు. ఈ వీడియో కింద వివిధ రకాలుగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో ఇండోనేషియాకు సంబంధించిందని కొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు కానీ కచ్చితంగా అక్కడిదే అని మనం చెప్పలేం. మరికొంత మంది మరో విధంగా కామెంట్ చేస్తున్నారు. ఆ అమ్మాయిని ఆ కొండచిలువ కచ్చితంగా తింటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇటువంటి వాటితో అస్సలు ఆటలు వద్దు.. జాగ్రత్తగా ఉండాలంటూ నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
    Published by:Veera Babu
    First published: