హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

నీ పేరు మా మమ్మీకి చెప్తా.. మెట్రోలో యువకుడిని చితక్కొట్టిన యువతి.. అసలేం జరిగిందంటే.. వీడియో వైరల్..

నీ పేరు మా మమ్మీకి చెప్తా.. మెట్రోలో యువకుడిని చితక్కొట్టిన యువతి.. అసలేం జరిగిందంటే.. వీడియో వైరల్..

మెట్రోలో యువకుడిని కొడుతున్న అమ్మాయి

మెట్రోలో యువకుడిని కొడుతున్న అమ్మాయి

Delhi: మెట్రోలో ఇద్దరు యువతీ, యువకులు ప్రయాణిస్తున్నారు. ఇంతలో యువతి కొనుక్కున్న డ్రెస్ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో యువతికి చిర్రెత్తుకొచ్చింది.

ప్రేమ అనేది ఒక అపురూపమైన బంధం. కొందరు దీన్ని తమ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. ప్రేమ ముసుగులో ఎదుటివారి బలహీనతలను ఆసరాగా చేసుకుంటున్నారు. అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు. ఇంట్లో వారికి తెలియకుండా.. ప్రేమించిన వారితో ఎక్కడికైన వెళ్తున్నారు. మరికొందరు లివింగ్ రిలేషన్ అంటూ.. కొత్త పొకడలకు పొతున్నారు. ప్రేమిస్తున్నామని చెప్పి... తమ అవసరాలు తీరిపోయాక ఆ తర్వాత.. ముఖం చాటేస్తున్నారు.

మరికొందరు.. ప్రేమలో చిన్నపాటి బేధాభిప్రాయాలు వచ్చిన వెంటనే బ్రేకప్ చెప్పేస్తున్నారు. ఇంకొందరు.. ప్రేమికులు.. అందరి ముందే గొడవలు పెట్టుకుంటున్నారు. తమదే నడవాలంటూ, అవతల వారికి చిరాకు తెప్పించే విధంగా ప్రవర్తిస్తుంటారు. కొన్ని సార్లు.. వీరి వింత ప్రవర్తన బహిరంగంగానే.. గొడవలు జరిగిన అనేక సంఘటనలు వార్తలలో నిలిచాయి. ఈ కోవకు చెందిన వీడియో క్లిప్పింగ్స్  ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీలోని (Delhi)  మెట్రో రైలులో (metro rail) షాకింగ్ ఘటన జరిగింది. ఇద్దరు యువతీ, యువకులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో.. యువతి.. స్థానికంగా ఉన్న జరా అనే మాల్ నుంచి బట్టలు కొనుక్కుంది. దీన్ని తన బాయ్ ఫ్రెండ్ కు చూపించింది. దాని ఖరీదు వెయ్యిరూపాయలు అని చెప్పింది. అయితే.. అతను కాస్త వెటకారంగా.. ఇది 150 కంటే ఎక్కువగా ఉండదని అన్నాడు. దీంతో అమ్మాయికి చిర్రెత్తు కొచ్చింది. అందరి ముందే అబ్బాయితో గొడవ పడింది. అంతటితో ఆగకుండా.. అతడిని కొట్టింది. అతను.. ఇది పబ్లిక్ ప్లేస్ బాగోదు.. అన్న వినలేదు. అతడితో వాగ్వాదానికి దిగి చితకొట్టింది.

ఇక .. అబ్బాయి కూడా తానేం తక్కువ అని కాకుండా.. యువతిని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో.. యువతి మా మా మమ్మికి చెప్తానంటూ రైలు దిగి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. వారు.. ప్రాంక్ వీడియో షూట్ చేసి ఉంటారంటూ కామెంట్ లు పెడుతున్నారు. మరికొందరు.. సరదాగా అలా చేసుంటారని కామెంట్ లు పెడుతున్నారు. అయితే, వారు సరదాగా గొడవ పడ్డారా.. లేదా నిజంగానే ఇది జరిగిందా అన్న దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఈ వీడియో (viral video)  మాత్రం నెట్టింట (Social media)  హల్ చల్ చేస్తుంది.

First published:

Tags: Delhi, Delhi metro, Girl friend, VIRAL NEWS

ఉత్తమ కథలు