VIRAL: కేంద్రమంత్రి వెనకాల చేరి.. అల్లరి పనిచేసిన అమ్మాయి..

కావాలని చేసిందో.. కాకతాళీయంగా జరిగిపోయిందో కానీ.. ఆ అమ్మాయి చేసిన అల్లరి పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

news18-telugu
Updated: February 2, 2019, 10:48 AM IST
VIRAL: కేంద్రమంత్రి వెనకాల చేరి.. అల్లరి పనిచేసిన అమ్మాయి..
కేంద్రమంత్రి జయంత్ సిన్హా వెనకాల అమ్మాయి కొంటె పని
news18-telugu
Updated: February 2, 2019, 10:48 AM IST
మీడియా కెమెరాల్లో అనుకోకుండా రికార్డయ్యే దృశ్యాలు కొన్ని భలే వైరల్ అవుతుంటాయి. తాజాగా కేంద్ర సహాయమంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతున్న ఓ వీడియో వైరల్‌గా మారింది. కారణం.. ఆ వీడియోలో మంత్రి గారి వెనకాల నిలబడ్డ ఓ అమ్మాయి అల్లరి చేష్టలు చేయడమే. ఇన్‌చార్జి కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం జయంత్ సిన్హా మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది.

బడ్జెట్‌పై జయంత్ సిన్హా ప్రశంసలు కురిపిస్తున్న తరుణంలో.. ఆయన వెనకాలే చేరిన ఓ అమ్మాయి కొంటె పనిచేసింది. మీడియా కెమెరా వైపు చూస్తూ నాలుకతో వెక్కిరిస్తున్నట్టుగా తమాషా చేసింది. కావాలని చేసిందో.. కాకతాళీయంగా జరిగిపోయిందో కానీ.. ఆ అమ్మాయి చేసిన అల్లరి పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజెన్స్ సెటైర్స్ వేస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఇంతకన్నా గొప్ప విశ్లేషణ ఏముంటుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.



First published: February 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...