Mobile Theft: ఫోన్ కొట్టేయాలనుకున్నోడి తాట తీసింది.. వెంటాడి దొంగను పట్టుకున్న అమ్మాయి

తన సెల్‌ఫోన్‌ను దొంగ నుంచి కాపాడుకునేందుకు ఆ అమ్మాయి చూపిన తెగువ అంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.

news18-telugu
Updated: September 1, 2020, 8:28 PM IST
Mobile Theft: ఫోన్ కొట్టేయాలనుకున్నోడి తాట తీసింది.. వెంటాడి దొంగను పట్టుకున్న అమ్మాయి
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
చైన్ స్నాచర్స్ తరహాలోనే ఫోన్లు కూడా కొట్టేసే దొంగలు ఉంటారు. రోడ్డు మీద ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లే వారి చేతిలో నుంచే ఫోన్ కాజేసి అక్కడి నుంచి క్షణాల్లో పారిపోవడం ఇలాంటి దొంగలకు బాగా అలవాటు. ఈ రకంగా ఫోన్ పొగొట్టుకున్న వాళ్లు కూడా చాలామంది ఉంటారు. అందులో మహిళలే ఎక్కువగా ఉంటారు. అయితే పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ నగరంలో మాత్రం అలా తన చేతిలోని ఫోన్ కొట్టేయాలని భావించిన ఓ దొంగ వెదవ తాట తీసింది 15 ఏళ్ల ఓ అమ్మాయి. తన ఫోన్ ఎత్తుకెళ్లాలని ప్రయత్నించిన దొంగ ఆటలు సాగనివ్వలేదు. తన శక్తినంతా కూడదీసుకుని అతడితో పోరాడింది.




అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని చూసి వెంటనే ఆ దొంగను పట్టుకున్నారు. దీంతో అతడితోపాటు బైక్‌పై వచ్చిన మరో దొంగ పారిపోయాడు. అయితే అమ్మాయి ఫోన్ ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించిన వ్యక్తి మాత్రం అక్కడి వాళ్లకు దొరికాడు. తన సెల్‌ఫోన్‌ను దొంగ నుంచి కాపాడుకునేందుకు ఆ అమ్మాయి చూపిన తెగువ అంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published by: Kishore Akkaladevi
First published: September 1, 2020, 7:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading