Girl falls from train : ప్రయాణికులు భద్రతా నియమాలను పాటించాలని భారతీయ రైల్వే(Indian Railway)ఎల్లప్పుడూ ప్రయాణికులకు సూచిస్తూనే ఉంటుంది. సీటుపై కూర్చోవాలని, కదులుతున్న రైలు ఎక్కవద్దని లేదా రైలు కదులుతున్న సమయంలో దిగవద్దని, కదులుతున్న రైలు డోర్(Train Door) దగ్గర నిలబడకూడదు ఇలా ప్రయాణికులకు ఎప్పుడూ సూచిస్తూ ఉంటుంది. అయితే చాలామంది రైల్వే హెచ్చరికలను పట్టించుకోక ప్రమాదాల బారిన పడుతున్నారు. అలాంటి ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్(Viral Video) అవుతోంది. ఓ యువతి అజాగ్రత్త కారణంగా ప్రాణాపాయం నుంచి బయటపడింది. వైరల్ వీడియోలో ఓ యువతి..కదులుతున్న రైలులోని డోర్ అంచున నిలబడి ఉంది. మొదట తన దుస్తులు సరిచేసుకుంటూ కనిపించిన ఆ యువతి...తర్వాత తన జుట్టును సరిచేసుకుంటూ, రైలు నుండి సగం శరీరాన్ని బయటకు పెట్టి గాలి పీల్చుకోవాలని అనుకుంది. అయితే ఇదే ఆమెకు సమస్యగా మారింది.
అయితే అదే ట్రాక్‌పై నుంచి రైలు వస్తన్న విషయాన్ని యువతి తెలియదు. దీంతో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి రైలు కింద పడింది. వెంటనే యువతి వెనుక నిలబడిన ప్రయాణికులే ఆమెకు దూతలా మారారు. ఈ ప్రయాణికులు సకాలంలో యువతి చేయి పట్టుకున్నారు. చాలా సేపటికి ఆ యువతి రైలుకు వేలాడుతూ ఉంది. అయితే అదృష్టవశాత్తూ ప్రయాణికులు బాలిక చేయి గట్టిగా పట్టుకున్నారు. అనంతరం బాలికను పైకి లాగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రమాదకరమైన ఈ వీడియోను చూసిన వారంతా డోర్ దగ్గర నిలబడి ప్రమాదాల గురించి మాట్లాడుకోవడం కనిపించింది ముంబై లోకల్ ట్రైన్ లో ఇది జరిగినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు,పవిత్రమైన నదిలో స్నానం (Ayodhya River) చేస్తు ఒక జంట రొమాన్స్ చేస్తు అడ్డంగా దొరికిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) ఈ ఘటన జరిగింది. పవిత్రమైన అయోధ్య నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇంతలో ఇద్దరు భార్యభర్తలు నదిలో స్నానం (Ayodhya kissing wife) చేయడానికి దిగారు. ఆ తర్వాత.. వారు చుట్టు పక్కన నదిలో జనాలు ఉన్నారన్న విషయం కూడా మరిచిపోయారు. ఒకరిని మరోకరు హగ్ చేసుకుని.. ముద్దులు పెట్టుకుంటున్నారు. దీన్ని కొంత మంది భక్తులు గమనించారు. వెంటనే వారి దగ్గరకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని.. నదినుంచి బైటకు లాగారు. ఒడ్డుమీద తీసుకెళ్లి .. పొట్టు పొట్టు కొట్టారు. అతని..భార్య జనాలను ఆపాలని చూసి ఎవరు వినిపించుకోలేదు. మనోడి.. చెంపలు, వీపు విమానం మోత మోగించారు. దీనిపై స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన నదిలో ఇలాంటి పాడు పనులను సహించబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (social media) వైరల్ గా (Viral video) మారింది. ఘటనపై అయోధ్య ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని స్థానిక పోలీసులు ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Train accident, Viral, Viral Video