GIANT COBRA SWALLOWS HUGE VIPER IN GUJARAT VIDEO GOES VIRAL PAH
OMG: కొండ చిలువను అమాంతం మింగుతున్న నాగుపాము.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..
కొండ చిలువను మింగుతున్న పాము..
Gujarat: స్థానికంగా ఉన్న ఫామ్ హౌస్ లో అలికిడి వినిపించింది. దీంతో అక్కడ ఉన్న వారు వెంటనే వెళ్లి చూశారు. అక్కడ సంఘటన చూసి షాక్ కు గురయ్యారు. నాగు పాము.. ఐదడుగుల కొండ చిలువతో పోరాడుతుంది.
మనలో చాలా మందికి పాములంటే చచ్చేంత భయం. దాని పేరు ఎత్తడానికి కూడా అసలు ఇష్టపడరు. మరికొంత మంది పాములు కన్పిస్తే.. ఆ దారిదాపుల్లోకి కూడా వెళ్లరు. సాధారణంగా పాములు ఆవాసం కోసం, ఆహారం వేటలో జనావాసాల్లోకి వస్తుంటాయి. అప్పుడు కొన్ని సార్లు.. మనుషులపై దాడులు చేస్తాయి. మరికొన్ని సార్లు మనిషి కూడా పాముకాటుకు గురౌతుంటాడు. ఇలాంటి పాముల భయంకర వీడియోలు అనేకం నెట్టింట (Social media) వైరల్ అయ్యాయి. తాజాగా, మరో ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. గుజరాత్ లో (Gujarat) ఈ ఘటన జరిగింది. వడోదర లోని కలాలీ అనే గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్ ఉంది. అక్కడ అనేక చెట్లతో దట్టంగా ఉంది. దీంతో అక్కడ ఒకరకమైన చెట్ల అలజడి విన్పించింది. వెంటనే అక్కడి వారు చెట్ల పొదల్లోకి వెళ్లి చూశారు. అక్కడ భయంకరమైన పాము, ఐదడుగుల కొండ చిలువను మింగేస్తుంది. వెంటనే వారంతా అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇచ్చారు. అయితే.. స్నేక్ క్యాచర్స్ అక్కడికి చేరుకున్నారు. పాము.. కొండ చిలువను సగం వరకు మింగేసింది.
స్నేక్ సొసైటీ వారు ప్రత్యేకంగా ఒక కర్రసహాయంతో పామును, కొండ చిలువను విడదీశారు. ఆ తర్వాత.. వాటిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ క్రమంలో దాన్ని అక్కడే ఉన్న ఒక బ్యాగులో వేశారు. ఆ తర్వాత.. దాన్ని సమీపంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు. స్నేక్ సొసైటీ వారు పాములను పట్టుకొవడంతో స్థానికులు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకున్నారు. స్నేక్ సోసైటీవారి ధైర్య సాహాసాలకు వారు కొనియాడారు.
అయితే, అడవికి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో తరచుగా పాములు, కొండ చిలువలు కన్పిస్తుంటాయని అధికారులు తెలిపారు. ఎక్కువగా పొదలు, చెట్లు ఉన్న ప్రాంతాలలో పాములు, కొండ చిలువలు తరచుగా కన్పిస్తుంటాయి. అవి అక్కడ ఆవాసంను ఏర్పాడు చేసుకుంటాయి. కొన్ని సార్లు.. మనుషులు అనుకొకుండా అక్కడికి వెళ్లినప్పుడు పాము కాటుకు గురౌతుంటారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.