అంతరిక్షంలో అప్పుడుప్పుడు అద్భుతాలు జరగడం చూస్తూనే ఉంటాం. మండుతున్న వస్తువులు (Asteroids) భూవాతావరణంలోకి రావడం ఈ మధ్య టీవీల్లో వీక్షిస్తున్నాం. కొన్ని రోజుల క్రితం ఓ ఖగోళ వస్తువు మండుతూ మహారాష్ట్రలో కిందపడింది. ఇలా ఉల్కలు భూమిని ఢీకొట్టడం వల్ల జరిగిన విధ్వంసానికి సంబంధించిన వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. లక్షల సంవత్సరాల క్రితం జరిగిన విధ్వంసమే దీని వెనుక కారణం. అప్పట్లో జరిగిన విధ్వంసం వల్ల.. ఈ భూప్రపంచం నుంచి డైనోసార్ (Dinosaurs) తుడిచిపెట్టుకుపోయాయి. ఒకవేళ అదే పరిస్థితి మళ్లీ వస్తే.. ఈసారి మనుషుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నాసాతో సహా పలు అంతరిక్ష సంస్థలు గ్రహశకలాలపై నిఘా ఉంచాయి. ఐతే ఈ వారంలో భూమికి అతి సమీపంలో మరో భారీ ఉల్క ప్రయాణిస్తుందని నాసా అంచనా వేసింది. అది భూమి వైపు వేగంగా కదులుతోంది.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA)... ఈ భారీ గ్రహశకలాన్ని భూమికి ముప్పు తెచ్చే జాబితాలో చేర్చింది. దీని వెడల్పు 2 వేల 7 వందల 56 అడుగులు. ఇది భూమి నుంచి ప్రస్తుతం 3.5 మిలియన్ మైళ్ల దూరంలో ఉంది. ఐనప్పటికీ నాసా మాత్రం దీని గురించి ఆందోళన పడుతోంది. 35 లక్షల మైళ్లంటే చాలా దూరం అని అనుకోవచ్చు. కానీ దాని వల్ల భూమికి ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. స్పేస్ ఏజెన్సీల రికార్డుల ప్రకారం.. ఏదేని గ్రహశకలం భూమికి 4.65 మిలియన్ మైళ్లకు దగ్గరగా వస్తే.. అది భూమికి ముప్పుగా పరిగణించబడుతుంది. కానీ ఇప్పుడు దూసుకొస్తున్న గ్రహశకలం.. కేవలం 3.5 మిలియన్ మైళ్ల దూరంలోనే ఉంది.
Free Train: ఈ రైలులో టికెట్ అవసరం లేదు.. ఉచితంగా ప్రయాణించవచ్చు.. ఎందుకు? ఎక్కడ?
అందుకే ఈ గ్రహశకలంపై ఖగోళ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో SpaceX CEO ఎలాన్ మస్క్ (Elon Musk) కూడా ఉన్నారు. భూమిపైకి భారీ గ్రహశకలం వస్తోందని.. దానిని తప్పించుకునే మార్గం లేదని ఆయన అన్నారు. దీనిని నివారించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా (NASA) మార్గాలను అన్వేషిస్తోంది.నాసా ఇటీవలే డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (Double Asteroid Redirection Test) మిషన్‌ను ప్రారంభించింది. భూమి వైపు దూసుకొచ్చే ఉల్కలను దారి మళ్లించడం దీని లక్ష్యం. తద్వారా భారీ గ్రహశకలాలు భూమిని ఢీకొనే అవకాశాలు తగ్గుతాయి.
Goat Birthday: మనకు మటన్.. కానీ వారికి సొంత బిడ్డ.. మేకకు ఘనంగా బర్త్ డే వేడుక
NASA DART మిషన్‌ల ఉల్కల దిశను అంతరిక్షంలోనే మళ్లిస్తారు. గతిశక్తి ద్వారా ఉల్కల దిశను మార్చుతారు. అప్పుడది భూమి వైపు రాకుండా.. అంతరిక్షంలోనే తిరుగుతుంది. అంతరిక్షంలో తిరుగుతున్న ఇలాంటి ఉల్కలు చాలా ఉన్నాయని.. వీటి వల్ల భూమికి ప్పుడో ఓసారి భూమికి సంభవించవచ్చని నాసా చెబుతోంది. డార్ట్ మిషన్ ద్వారా వాటి దిశను మార్చేందుకు తీవ్రంగా ప్రయణిస్తున్నామని.. ఇది విజయవంతమైతే ఇలాంటి భారీ గ్రహశకలాల ముప్పు నుంచి భూమిని కాపాడుకోవచ్చని వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: NASA, Space, Trending, Trending news