హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Strange Rules: ఈ స్కూళ్లలో వింత రూల్స్.. ఫ్రెండ్‌షిప్ చేయడం, చప్పట్లు కొట్టడం కూడా నిషేధం..

Strange Rules: ఈ స్కూళ్లలో వింత రూల్స్.. ఫ్రెండ్‌షిప్ చేయడం, చప్పట్లు కొట్టడం కూడా నిషేధం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Strange Rules: కొన్ని స్కూళ్లలో చిత్ర, విచిత్రమైన నిబంధనలను అమలు చేస్తున్నారు. తోటి విద్యార్థులతో స్నేహం చేయకూడదు.. వాష్ రూమ్‌కు కూడా కొన్నిసార్లు మాత్రమే వెళ్లాలనే నిబంధనలను ఉన్నాయి. అయితే ఇలాంటి నిబంధనలను ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందో కారణాలను కూడా చెబుతున్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

సాధారణంగా పాఠశాల (School) వాతావరణం విద్యార్థులతో సందడిగా ఉంటుంది. చదువుతో పాటు ఆట పాటలకు కొదవ ఉండదు. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ప్రత్యేకంగా కొన్ని స్కూళ్లలో చిత్ర, విచిత్రమైన నిబంధనలను అమలు చేస్తున్నారు. తోటి విద్యార్థులతో స్నేహం (Friendship) చేయకూడదు.. వాష్ రూమ్‌కు కూడా కొన్నిసార్లు మాత్రమే వెళ్లాలనే నిబంధనలను ఉన్నాయి. అయితే ఇలాంటి నిబంధనలను ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందో కారణాలను కూడా చెబుతున్నాయి. ఈ వింత నిబంధనలను అమలు చేస్తున్న స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

* థామస్ స్కూల్ - ఫ్రెండ్‌షిప్ నిషేధం

ఈ స్కూల్ బ్రిటన్‌లో ఉంది. స్కూల్ యాజమాన్యం విచిత్రమైన రూల్ పెట్టింది. ఇక్కడ విద్యార్థులు తమ తోటి విద్యార్థులతో స్నేహం చేయకూడదు. ఇదేమీ నిబంధన వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. అయితే ఈ వెరైటీ నిబంధన పెట్టడానికి కారణాలను యాజమాన్యం తెలిపింది. స్నేహితుల నుంచి విడిపోయినప్పుడు విద్యార్థులు ఒంటరినైనట్లుగా ఫీల్ అవుతున్నారని.. అందుకే స్కూల్‌లో విద్యార్థుల మధ్య ఫ్రెండ్‌షిప్‌ను నిషేధించామని స్కూల్ యాజమాన్యం చెప్పుకొచ్చింది.

* ఎవర్ గ్రీన్ పార్క్ స్కూల్- వాష్ రూమ్‌కు వెళ్లడంపై పరిమితి

సాధారణంగా ఏ స్కూల్‌లోనైనా వాష్ రూమ్‌కు వెళ్లడంపై ఎలాంటి పరిమితులు ఉండవు. అయితే అమెరికాలోని చికాగో నగరంలో ఉన్న ఎవర్‌గ్రీన్ పార్క్ హై స్కూల్‌లో విద్యార్థులు వాష్‌రూమ్‌కి వెళ్లడంపై పరిమితి విధించారు. ప్రతి తరగతిలోని విద్యార్థులు రోజుకు కేవలం మూడు సార్లు మాత్రమే వాష్‌రూమ్‌కు వెళ్లాలనే నిబంధన విధించారు. పిల్లలు అనవసరంగా సమయాన్ని వృథా చేసుకోకుండా ఉండేందుకు ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం చెప్పుకొచ్చింది.

* చప్పట్లు కొట్టడం, హగ్ చేసుకోవడం నిషేధం

సాధారణంగా చాలా మంది పిల్లలు తమ స్నేహితులను కలిసినప్పుడు హగ్ చేసుకుంటారు. ఇక, ఆట పాటలతో చిందేసినప్పుడు ఉత్సాహంతో చప్పుట్లు కొట్టడం సహజం. అయితే ఇలాంటి హావభావాలు కొన్ని దేశాల్లోని స్కూల్స్‌లో నిషేధం విధించారు. ప్రధానంగా బ్రిటన్, అమెరికాలోని అనేక స్కూల్స్‌లో చప్పట్లు కొట్టడం, తోటి విద్యార్థులను హగ్ చేసుకోవడం‌ వంటి వాటిని నిషేధించారు.

ఇది కూడా చదవండి : ఐఐటీ జోధ్‌పూర్‌లో మాట్లాడే మొత్తం భాషలు 16.. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే!

* జాక్సిన్ నంబర్ 1 స్కూల్ - మధ్యాహ్నం నిద్ర

మధ్యాహ్నం సమయంలో కూడా ఫ్రెష్‌ లుక్ లో కనిపించడం కోసం చైనాలోని ఓ స్కూల్ విద్యార్థులను నిద్రపోవడానికి అనుమతిస్తుంది. Gaoxin No.1 అనే ఎలిమెంటరీ స్కూల్‌ లో విద్యార్థులు మధ్యాహ్నం 12.10 నుంచి 2 గంటల వరకు భోజన సమయంలో నిద్రపోతారు. పిల్లలు ఫ్రెష్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిబంధనను అమలు చేస్తోంది.

* జపాన్ స్కూల్స్- నో మేకప్

జపాన్‌ అంటేనే క్రమశిక్షణకు మారు‌పేరు. అక్కడ కొన్ని హైస్కూళ్లలో డ్రెస్ కోడ్‌ను తూచా తప్పకుండా పాటిస్తాయి. నిబంధన విధించాయి అంటే విద్యార్థులు తప్పనిసరిగా పాటించాలి. విద్యార్థుల జుట్టు ఎంత పొడవు ఉండాలి.. గోర్ల సైజ్ ఎంత ఉండాలో స్పష్టమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి అక్కడి విద్యా సంస్థలు. చాలా స్కూళ్లలో మేకప్, నెయిల్ పాలిష్ లేదా పియర్సింగ్‌‌ను నిషేధం విధించారు. అలాగే విద్యార్థుల మధ్య రిలేషన్‌షిప్ ఉండకూడదని దాన్ని కూడా నిషేధించారు. రిలేషన్ అనేది పిల్లల దృష్టిని మరల్చుతుందని, దీంతో స్కూల్ డ్రాప్-అవుట్ కేసులు పెరుగుతాయనే కారణంతో ఈ నిబంధనను అమలు చేస్తున్నాయి.

Published by:Sridhar Reddy
First published:

Tags: CAREER, EDUCATION, Schools, VIRAL NEWS

ఉత్తమ కథలు