హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: హ్యూమన్ బార్బీగా మారిన యువతి.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఫ్యామిలీ.. కారణం ఏంటంటే..

OMG: హ్యూమన్ బార్బీగా మారిన యువతి.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఫ్యామిలీ.. కారణం ఏంటంటే..

సర్జరీ చేసుకున్న జర్మన్ యువతి

సర్జరీ చేసుకున్న జర్మన్ యువతి

Germany: జర్మనీకి యువతి బార్బీలాగా అందంగా మారాలనుకుంది. దీని కోసం సర్జరీలు చేసుకుంటానని ఇంట్లో వారికి చెప్పింది. కానీ వారు దీనికి అంగీకరించలేదు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది.

సాధారణంగా అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం ఇష్టపడుతుంటారు. అందరికన్న ఎట్రాక్షన్ గా కన్పించడం కోసం తెగ తాపత్రయపడిపోతుంటారు. దీని కోసం రకారకాల ఫెషియల్స్, క్రీమ్ లను తమ ముఖాలకు అప్లై చేస్తుంటారు. అయితే, మరి కొందరు ఒక అడుగు ముందుకేసి.. సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఇప్పటికే కొందరు అమ్మాయిలు ముక్కు, నోరు, రొమ్ముల భాగాలలో సర్జరీలు చేసుకున్న ఘటనలు మనం చూశాం. కొన్ని సార్లు.. సర్జరీల వలన కొంత మంది అమ్మాయిలు ముందటి కన్నా.. ఎంతో అందంగా మారారు. కొన్ని సార్లు.. అమ్మాయిలు సర్జరీల వలన ముఖం దెబ్బతిన్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే, జర్మనీకి చెందిన జెస్సీ బన్నీ అనే 21 ఏళ్ల అమ్మాయి సర్జరీలు చేసుకుని బార్బీలాగా మారింది. ప్రస్తుతం ఈ యువతి వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. జర్మనీకి (Jarmany) చెందిన జెస్పీ బన్నీ అనే యువతి హ్యూమన్ బార్బీలా మారాలనుకుంది. తన ఇష్టాన్ని  కుటుంబ సభ్యులకు చెప్పింది. కానీ వారు దీన్ని వ్యతిరేకించారు. దీంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది.  జర్మనీ నుంచి వియాన్న చేరుకుంది. అక్కడ సర్జరీలు చేసే వారిని సంప్రదించింది. దీని కోసం అనేక సర్జరీలు అవసరమని తెలుసుకుంది. అయితే, జెస్సీకి (Jessy Bunny) వారి నాన్న.. డ్రైవింగ్ నేర్చుకొవడానికి కొంత డబ్బు ఇచ్చారు. దీన్ని యువతి దాచిపెట్టుకుంది.  తొలిసారి అదే డబ్బును.. సర్జరీకి ఉపయోగించింది.

ఇప్పటికి వరకు ఆమె మూడు సర్జరీలను సక్సెస్ ఫుల్ గా చేసుకుంది. దీని కోసం సుమారు.. రూ. 53 లక్షలు (70 వేల డాలర్లు ) ఖర్చుచేసినట్లు సమాచారం. ప్రస్తుతం మునుపటి కంటె ఎంతో అందంగా ఉన్నానని తెలపింది. కానీ సర్జరీ చేసుకున్నప్పటి నుంచి ఫ్యామిలీ (Transform Into Human Barbie)తనను అవైడ్ చేశారని బాధపడింది. తన నెంబర్ ను కూడా బ్లాక్ చేశారని ఆవేదన చెందింది. ప్రస్తుతం తనలో ఆత్మ విశ్వాసం మరింత పెరిగిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చేసుకున్న సర్జరీలతో రొమ్ములు, పెదాలు, పిరుదులు అందంగా బొద్దుగా మారాయని చెప్పింది. తొందరలోనే మరికొన్ని సర్జరీలు చేసుకొవడంతో.. పూర్తి స్థాయి బేబీడాల్ మాదిరిగా తన శరీరాన్ని మరింత అందంగా మార్చుకుంటానని జెస్సీ బన్నీ వెల్లడించింది.

First published:

Tags: Germany, Plastic, Surgery twit

ఉత్తమ కథలు