భారత ప్రధాన నరేంద్రమోదీ (Pm modi) జర్మనీలో జరుగుతున్న జీ7 వార్షిక సమావేశంలో పాల్గొనడానికి వెళ్లారు. ఈ సమావేశంలో జీ7 సభ్య దేశాలైన.. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీలతో అధినేతలు హజరయ్యారు. ఈ క్రమంలో మోదీ.. పలు దేశాల నాయకులతో కరచాలనం చేస్తున్నారు. అప్పుడు ఒక ఆసక్తర ఘటన జరిగింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (Joe biden) అక్కడికి చేరుకున్నారు.
ప్రోటోకాల్ పక్కన పెట్టి మోదీని.. పిలిచి మరీ కరచాలనం చేశారు. మోదీ కూడా తిరిగి అంతే ఆప్యాయంగా అమెరికా అధ్యక్షుడి తో మాట్లాడారు. పలు దేశాల నాయకాలు మోదీని పలకరించడానికి ఆసక్తి చూపించారు. ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన దేశం, పెద్దన్న పాత్ర పోషించే దేశాధ్యక్షుడు మోదీని స్వయంగా వచ్చి పలకరించడం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్శించింది. ప్రస్తుంతం ఈ వీడియో నెట్టింట (Social media) వైరల్ గా (viral video) మారింది.
#WATCH | US President Joe Biden walked up to Prime Minister Narendra Modi to greet him ahead of the G7 Summit at Schloss Elmau in Germany.
(Source: Reuters) pic.twitter.com/gkZisfe6sl
— ANI (@ANI) June 27, 2022
దేశ ప్రధాని మోదీ (PM Modi) జర్మనీలో జీ 7 దేశాల సమావేశంలో పాల్గొనడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం.. ఆడి డోమ్ ఇండోర్ ఎరీనాలో భారీ ఎత్తున సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మ్యూనిచ్ లో జరిగిన సభలో.. ప్రవాస భారతీయులను ఉద్యేషించి మాట్లాడారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పగలడని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రజాస్వామ్య విలువలను కొనియాడుతూ.. 47 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ (Congress party) భారత సజీవ ప్రజాస్వామ్యానికి (Emergency block day) నల్ల మచ్చ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అన్నారు. నలభై ఏడేళ్ల క్రితం ప్రజాస్వామ్యాన్ని బందీగా ఉంచి అణిచివేసే ప్రయత్నం జరిగిందని కాంగ్రెస్ ను విమర్శించారు.
భారతదేశం యొక్క శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి (Democracy) ఎమర్జెన్సీ ఒక నల్ల మచ్చ అని G7 సమ్మిట్‌లో పాల్గొనడానికి జర్మనీని సందర్శించిన ప్రధాని మోడీ.. కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని అన్నారు. భారతీయులమైన మనం ఎక్కడ నివసించినా మన ప్రజాస్వామ్యం గురించి గర్వంగా భావిస్తున్నాం.భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పగలడని అని ప్రధాని మోదీ అన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జూన్ 25, 1975న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆ తర్వాత... మార్చి 21, 1977న ఎత్తివేయబడింది. ఈ మధ్య కాలంలో అనేక అణచివేత కార్యక్రమాలు జరిగాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Germany, Joe Biden, Pm modi, Viral Video