• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • GERMAN ZOO GIVES AWAY UNSOLD CHRISTMAS TREES TO ELEPHANTS AND MONKEYS NK

జూలో జంతువులకు క్రిస్మస్ ట్రీస్... వైరల్ వీడియో...

జూలో జంతువులకు క్రిస్మస్ ట్రీస్... (credit : AFP)

ఇది వరకు క్రిస్మస్ ట్రీస్ సేల్ కాకపోతే... అవి వృథా అయ్యేవి. ఈసారి మాత్రం వాటితో మంచి ప్రయోజనం కలిగింది.

  • Share this:
    జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఉన్న రెండు జూలలో ఒకటి... టైయర్ పార్క్. ఈ జూ అధికారులకు ఓ కొత్త ఆలోచన వచ్చింది. ఏంటంటే... క్రిస్మస్ పండుగ కోసం తెచ్చి... అమ్ముడు కాకుండా మిగిలిపోయిన క్రిస్మస్ ట్రీలను వేర్వేరు షాపుల్లో కొని... జూకి తీసుకొచ్చారు. వాటికి రొట్టెలు, పండ్లను సెట్ చేశారు. ఆ ట్రీస్‌ని జూలో... ఏనుగులు, కోతులు, ఇతర జంతువులు ఉండే చోట ఉంచారు. ప్రజల నుంచీ ఇలాంటి చెట్లను తీసుకోలేదు. ఎందుకంటే... చెట్లను వారు డెకరేట్ చేస్తారు కాబట్టి... కెమికల్స్ ఉంటాయనే ఉద్దేశంతో... వాటిని తీసుకోలేదు. షాపుల నుంచీ తెచ్చిన చెట్లలో కొన్నింటిని ఏనుగులకు ఇచ్చారు. అవి వాటిని డైరెక్టుగా తినేశాయి. కోతుల కోసం చెట్లకు పండ్లను అమర్చి ఇచ్చారు. అవి ఖుషీ అయిపోయాయి. ఇక పులుల కోసం అవే చెట్లకు మాంసాన్ని డెకరేట్ చేసి ఇచ్చారు. పులులు కూడా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇలా క్రిస్మస్ ట్రీస్ వేస్ట్ కాకుండా... చక్కగా ఉపయోగించి... జూకి వచ్చే సందర్శకులు, టూరిస్టుల ప్రశంసలు పొందుతున్నారు అధికారులు.

    Published by:Krishna Kumar N
    First published: