• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • GERMAN RESEARCHERS FOUND 3500 YEARS OLD HONEY POT IN AFRICA BELONGS TO NOK CULTURE FULL DETAILS HERE PRN GH

Nok Culture: ఆఫ్రికాలో అరుదైన హనీపాట్ వెలికితీత... ఎప్పటిదో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Nok Culture: ఆఫ్రికాలో అరుదైన హనీపాట్ వెలికితీత... ఎప్పటిదో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ప్రతీకాత్మక చిత్రం

యూకేలోని బ్రిస్టల్ వర్సిటీకి (UK Bristol University) చెందిన రసాయాన శాస్త్రవేత్తల సహకారంతో జర్మనీ గోథే వర్సిటీకి చెందిన పురావస్తు పరిశోధకులు నోక్ సంస్కృతికి చెందిన ఈ పాత్రను కనుగొన్నారు

  • Share this:
ఆఫ్రికాలో అతిపురాతన హనీ పాట్ (తేనె సేకరించే పాత్ర)ను పరిశోధకులు కనుగొన్నారు. ఇది 3500 ఏళ్ల క్రితం నాటి హనీపాట్ అని తెలిపారు. ఆఫ్రికా ఖండంలోనే అతి పురాతన హనీ కంటైనర్ అని స్పష్టం చేశారు. యూకేలోని బ్రిస్టల్ వర్సిటీకి చెందిన రసాయాన శాస్త్రవేత్తల సహకారంతో జర్మనీ గోథే వర్సిటీకి చెందిన పురావస్తు పరిశోధకులు నోక్ సంస్కృతికి చెందిన ఈ పాత్రను కనుగొన్నారు. 3500 ఏళ్ల నాటి ఈ కుండలో తేనెటీగల అవశేషాలను గుర్తించారు. దీంతో పురాతన ఆఫ్రికన్లు తేనె సేకరించేవారనేదానికి సాక్ష్యం లభించినట్లయింది. నోక్ కల్చర్ ప్రధానంగా క్రీస్తూపూర్వం 1500లో నైజీరియాలో అభివృద్ధి చెందింది. ఆధునిక యుగం ప్రారంభంలో ఈ నాగరికత ఉండేది. విస్తృతమైన టెర్రాకోట శిల్పాలకు ఈ సంస్కృతి ప్రసిద్ధి చెందింది. ఇవి ఆఫ్రికాలోని అతిపురాతన అలంకారిక కళకు చెందినవి.

ఆఫ్రికా ప్రారంభ చరిత్రలో ఇది ప్రత్యేకమైందని, తేనె రోజువారీ మెనులో ముఖ్యమైన భాగమని గోథే వర్సిటీ అధ్యాపకులు పీటర్ బ్రూనిక్ తెలిపారు. "3500 ఏళ్ల క్రితమే తేనె వాడేవారని ఎథ్నో గ్రాఫిక్ డేటా ఆధారంగా కనుగొన్నాం. ప్రీ హిస్టారిక్ పాటరీ(చరిత్ర పూర్వ కుండల) నుంచి బయో మాలుక్యులర్ సమాచారాన్ని అందిస్తుందనే దానికి ఇది గొప్ప ఉదాహరణ" అని బ్రిస్టల్ వర్సిటీకి చెందిన జూలీ డున్నే తెలిపారు. నేచర్ కమ్యునికేషన్స్ అనే పత్రికలో ఈ విషయాలను ప్రచురించారు. నోక్ ప్రజలు పెంపుడు జంతువులను కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఈ బృందం అధ్యయనం ప్రారంభించింది. మూడో వంతు పరిశీలనల్లో తేనెటీగకు విలక్షణమైన అధిక మాలిక్యులర్ లిపిడ్లను కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ లిపిడ్లను పునర్నిర్మించడం ఈ అధ్యయనకారుల వల్ల కాలేదు. వారు బీస్ వ్యాక్స్ నుంచి తేనెను వేరు చేయడానికి వాటిని కుండల్లో వేడి చేసేవారని పరిశోధకులు భావిస్తున్నారు.

తేనెను ప్రాసెస్ చేసేందుకు జంతువులు, మొక్కల నుంచి సేకరించిన ఇతర ముడి పదార్థాలను వాడేవారు. సంప్రదాయ ఆఫ్రికన్ సమాజంలో నేటికి ఈ విధానాన్ని వాడుతున్నారు. మట్టికుండలను బీహైవ్స్ గా ఉపయోగించేవారని మరో బృందం పేర్కొంది. "ఆఫ్రికాలో తేనె వాడే సంప్రదాయం చాలా కాలంగా ఉందని మేము అనుకుంటున్నాం. ఆఫ్రికా ఖండంలో పురాతన కుండలు సుమారు 11 వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇందులో కూడా తేనెటీగల అవశేషాలు ఉన్నాయా?" అని గోథేకు చెందిన ప్రముఖ అద్యాపకుడు క్యాథరినా న్యూమన్ ప్రశ్నించారు.
Published by:Purna Chandra
First published:

అగ్ర కథనాలు