చిన్నప్పుడు రోగాలు రాకపోతే... పెద్దయ్యాక ల్యుకేమియా సోకే ప్రమాదం... పరిశోధనలో వెల్లడి...

ఇది మన ఆలోచనలకు పూర్తి భిన్నమైన పరిశోధన. జనరల్‌గా మనం ఏమనుకుంటాం. మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనీ, వాళ్లకు ఏ వ్యాధులూ సోకకూడదనీ అనుకుంటాం. కానీ ఈ పరిశోధన అందుకు పూర్తి భిన్నంగా ఉంది. చిన్నప్పుడు వ్యాధులు రావడమే మంచిదంటోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 12, 2019, 1:06 PM IST
చిన్నప్పుడు రోగాలు రాకపోతే... పెద్దయ్యాక ల్యుకేమియా సోకే ప్రమాదం... పరిశోధనలో వెల్లడి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కష్టాలు ఎదురయ్యే కొద్దీ మనుషులు రాటుదేలుతారు... ఎన్ని ఎదురుదెబ్బలు తగిలితే... అంత మంచిది అంటుంటారు మన పెద్దలు. అది అక్షరాలా నిజం అంటున్నారు ఇప్పటి పరిశోధకులు. వాళ్లు చెప్పేదేంటంటే... పుట్టే పిల్లలు పూర్తి ఆరోగ్యంగా పుట్టినా... మొదటి ఏడాదిపాటూ... వాళ్లకు జ్వరాలు, ఇతరత్రా వ్యాధులు వస్తే మంచిదే అంటున్నారు. అలా వ్యాధులు రావడం వల్ల వాటిని ఎదుర్కొనే శక్తి వాళ్ల శరీరానికి అలవాటవుతుందనీ, వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు అది ఉపయోగపడుతుందనీ అంటున్నారు. కాబట్టి... తల్లిదండ్రులు... తమ పిల్లల్ని పూర్తి ఆరోగ్యంగా పెంచాలని అనుకోవద్దనీ, వాళ్లకు చిన్న చిన్న రోగాలు, రుగ్మతల వంటివి వస్తే... కంగారు పడి... వెంటనే టాబ్లెట్లూ, ట్రీట్‌మెంట్లూ చేయించేయవద్దని సూచిస్తున్నా్రు.

రోగం రాగానే... కొంత టైమ్ ఎదురు చూడాలనీ, ఆ టైంలో ఆ రోగం దానంతట అది తగ్గకపోతే... అప్పుడు డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లడం మంచిదంటున్నారు. 95 శాతం మంది పిల్లల్లో... రోగాలు వచ్చినప్పుడు... వాటంతట అవి తగ్గేలా చేసే రోగ నిరోధక వ్యవస్థ ఆటోమేటిక్‌గా చురుగ్గా మారి... బ్యాక్టీరియా అంతు చూస్తుందని సూచిస్తున్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాల్ని నేచర్ రివ్యూస్ కాన్సర్ జర్నల్‌లో ప్రచురించారు.

చిన్నప్పుడు పిల్లలకూ ఏ జబ్బులూ, రోగాలూ, రుగ్మతల వంటివి రాకపోతే... పెద్దయ్యాక (అంటే నాలుగేళ్లలోపు)... వాళ్లకు కాన్సర్, ల్యుకేమియా వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. చిన్నప్పుడు (మొదది ఏడాది వయసులో) పూర్తి ఆరోగ్యంగా పెరిగే పిల్లల్లో ఎక్కువగా 'ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా' (Acute Lymphoblastic Leukemia) సోకుతోందట. ఇదో రకమైన ఐదేళ్ల లోపు పిల్లలకు సోకే కాన్సర్. ఇది రక్త కణాలను దెబ్బతీసే కాన్సర్. ఇది రెండు రకాలుగా సోకుతుంది. మొదటిది పిల్లల జన్యువుల్లో లోపాల వల్ల వ్యాపిస్తుంది. రెండోది వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల సోకుతుంది.

ఈ ల్యుకేమియా వ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తుంది. మొదట రక్త కణాల్లో వ్యాపించి, తర్వాత మిగతా శరీర భాగాల్ని నాశనం చేస్తుంది. చివరకు ఊపిరితిత్తులు, లివర్, నరాలను కూడా దెబ్బతీస్తుంది. యూరప్‌లో పిల్లలకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతోంది. ఇలా జరగాలని మనం కోరుకోవద్దు కానీ... పరిశోధనలో తేలింది కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇదంతా ఎందుకు... పిల్లల పట్ల అతి శుభ్రత, అతి జాగ్రత్తలు లేకుండా... పేరెంట్స్ కాస్త లైట్ తీసుకోండి... ఏం కాదులే. ఏమంటారు.

First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...