సాల్మన్ చేపలకు అమెరికా గ్రీన్ సిగ్నల్... షరతులు వర్తిస్తాయి...

Salmon Fish : కెనడాలో సాల్మన్ ఫిష్‌ తినేందుకు అనుమతి ఉన్నా... అమెరికాలో లేదు. ఇప్పుడు అందుకు తలుపులు తెరచుకున్నాయి. కారణం జన్యుపరంగా చేసిన మార్పులే.

Krishna Kumar N | news18-telugu
Updated: June 22, 2019, 7:49 AM IST
సాల్మన్ చేపలకు అమెరికా గ్రీన్ సిగ్నల్... షరతులు వర్తిస్తాయి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమెరికా మాంస ఆహార కొరతను తీర్చడంలో సాల్మన్ చేపలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న ఆ చేపల్ని అమెరికా కొన్ని కారణాలతో అనుమతించట్లేదు. ఐతే... ఏడాది పాటూ కష్టపడి శాస్త్రవేత్తలు జన్యుపరంగా చేపల్లో మార్పులు చేశారు. తద్వారా ఆ చేపలు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలూ రావనీ, పైగా ఇప్పుడున్న చేపల కంటే... కొత్త సాల్మన్ చేపలు వేగంగా పెరుగుతాయని నిరూపించారు. దాంతో అమెరికా ప్రభుత్వం సాల్మన్ చేపలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో తొలిసారి కొత్త చేపలకు సంబంధించిన గుడ్లను ఇండియానాలోని ఆక్వాబౌంటీ కంపెనీ కెనడా నుంచీ అమెరికాకు తీసుకొచ్చింది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని... చేపల్ని పెంచుతోంది. బయో ఇంజినీర్లు ఈ చేపల్ని జాగ్రత్తగా పెంచుతున్నారు.

దాదాపు 35 కేజీల బరువుండే సాల్మన్ చేపలు పెరిగేందుకు 17 నుంచీ 18 నెలల సమయం పడుతుంది. అంటే 2020 చివరి నాటికి అమెరికాలో తొలి జన్యుమార్పుల సాల్మన్ చేపలు మార్కెట్లు, రెస్టారెంట్లలోకి వస్తాయన్నమాట. ఇవి కూడా చదవండి :

Video : యూట్యూబ్ ద్వారా బాతు పిల్లల్ని కాపాడారు... ఇదెలా జరిగిందంటే...

Viral Video : పాటలు పాడుతున్న సీల్ చేపలు...నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్... ఇక రెండు వారాలు వర్షాలే...వర్షాలు

టీడీపీని చరిత్రలో కలిపేస్తారా... బీజేపీ ప్లాన్ అదేనా?
First published: June 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>