హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Geminid meteor shower: నక్షత్రాల వర్షం.. ఆకాశంలో అద్భుతం..జెమినెడ్ ఉల్కాపాతాన్ని చూశారా?

Geminid meteor shower: నక్షత్రాల వర్షం.. ఆకాశంలో అద్భుతం..జెమినెడ్ ఉల్కాపాతాన్ని చూశారా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Geminid meteor shower: ఉల్కాపాతాలు భూమిని తాకే లోపే కాలి భూడిదైపోతాయి. వాటి పరిమాణం కూడా చాలా చిన్నగా ఉంటాయి. కాబట్టి జెమినిడ్ ఉల్కాపాతం వల్ల భూమికి నష్టం వాటిల్లే అవకాశం లేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(బాలకృష్ణ, న్యూస్18 తెలుగు, హైదరాబాద్)

ఆకాశంలో అప్పుడప్పుడూ ఉల్కాపాతాలు వస్తూ ఉంటాయి. అయితే వాతావరణం స్పష్టంగా లేకపోవడం, వాయు కాలుష్యం ఎక్కువగా నమోదు కావడం, ఆకాశం మేఘావృతం కావడం, పట్టణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో విద్యుత్ కాంతుల వల్ల అవి కనిపించవు. అయితే బుధవారం అర్థరాత్రి 2 గంటలకు వచ్చిన జెమినిడ్ ఉల్కాపాతం (Geminid meteor shower) మాత్రం చాలా స్పష్టంగా కనిపించింది. నక్షత్రాల వర్షం కురిసినట్లుగా.. ఆకాశంలో కనువిందు చేసింది. ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తే.. ఏదో కొత్త లోకంలో ఉన్నట్లుగా అనిపించింది.

జెమినిడ్ ఉల్కాపాతం నిన్న రాత్రి 2 గంటల నుంచి కనువిందు చేసింది. గంటకు దాదాపు 150 ఉల్కలు కనిపించాయి. డిసెంబరు 14 సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత నుంచి ఉల్కాపాతం ప్రారంభమయింది. డిసెంబరు 4 నుంచే యాక్టివ్ గా ఉన్న జెమినిడ్ ఉల్కాపాతం, 2022 డిసెంబరు 14 అర్థరాత్రి 2 గంటల సమయానికి గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇంటర్నేషన్ మెటీరర్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం డిసెంబరు 14 రాత్రి ఆరున్నర గంటల తరవాత గరిష్ఠంగా 150 ఉల్కలు కనువిందు చేశాయి.  వాటిని చాలా మంది తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

జెమినిడ్ ఉల్కాపాతం ఈ నెల 17 వరకు ఆకాశంలో కనువిందు చేయనుంది. జెమినిడ్ ఉల్కాపాతం స్పష్టంగా చూడటానికి టెలిస్కోప్ కూడా అవసరం లేదు.

ఉల్కాపాతం అనేది నక్షత్రాల ధూళి లేదా శిధిలాలు. అంతరిక్ష ధూళి భూ వాతావరణాన్ని తాకి కాంతి జ్వాలగా మారి కాలిపోతుంది. ఆకాశంలో ఒకే ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉల్కలు కనిపిస్తే దాన్ని ఉల్కాపాతం అంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా గమనించే అత్యంత ప్రసిద్ధ వార్షిక ఉల్కాపాతాలలో జెమినిడ్స్ ఒకటి. చాలా ఉల్కాపాతాలు తోకచుక్కల నుండి వచ్చినప్పటికీ, జెమినిడ్‌లు ఫేథాన్ గ్రహశకలం నుండి వచ్చాయి. దీన్ని మొదటిసారి అక్టోబర్ 11, 1983న కనుగొన్నారు.

Earth : భూమికి రెండు ఆపదలు .. ఉల్కాపాతం .. గ్రహశకలం .. ఏమవుతుంది?

ఉల్కాపాతం వదిలిన దారి గుండా భూమి వెళుతుంది. ఉల్కాపాతం నుంచి వచ్చిన కొన్ని ఉల్కలు, మన గ్రహం ఎగువ వాతావరణంలో కాలిపోతాయి. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, జెమినిడ్స్ గంటకు 78000 మిలియన్ కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

ఉల్కాపాతాలపై రెండు శతాబ్దాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఉల్కాపాతాల వల్ల భూమికి నష్టం వాటిల్లిన ఘటనలు నమోదు కాలేదు. ఉల్కాపాతాలు భూమిని తాకే లోపే కాలి భూడిదైపోతాయి. వాటి పరిమాణం కూడా చాలా చిన్నగా ఉంటాయి. కాబట్టి జెమినిడ్ ఉల్కాపాతం వల్ల భూమికి నష్టం వాటిల్లే అవకాశం లేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఉల్కాపాతం అనేది ప్రతినిత్యం జరిగే ప్రక్రియే. అయితే అవి ఒక్కోసారి ఎక్కువగా ఉంటాయి.

First published:

Tags: Sky, Space, Trending

ఉత్తమ కథలు