అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లు.. రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

Narendra-Modi-greets-President-Ram-Nath-Kovind file

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుబడిన వారికి విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చేసింది. రాష్ట్రపతి ఆమోదంతో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు చట్టంగా మారింది.

 • Share this:
  అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి రాజముద్ర పడింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా కేంద్రం 124వ రాజ్యాంగ సవరణ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టగా సుధీర్గ చర్చల అనంతరం ఆమోదం లభించింది. పార్లమెంట్ ఉభయ సభలతో ఆమోదం పొందిన రాజ్యాంగ సవరణ బిల్లును తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. రాజముద్రతో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ల అంశం చట్టరూపం దాల్చినట్టైంది. ఆ మరుక్షణమే అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేశాయి.

  President of India to Visit Telangana, Tamil Nadu and Kerala from August 4 TO 7, 2018
  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ఫైల్ ఫొటో)


  సార్వత్రిక ఎన్నికల ముంగిట  ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈబీసీ అస్త్రాన్ని సంధించారు. ఇటీవల సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. రిజర్వేషన్ల అర్హత ధృవీకరణలు రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయని కేంద్రం స్ఫష్టంచేసింది. కులమతాలకు అతీతంగా ఈబీసీలందరికీ ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని తెలిపింది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశానుసారం దేశంలో 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదు కాబట్టి.. అదనంగా ఈ 10శాతం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగసవరణ చేపట్టింది కేంద్రం. ఈ బిల్లుకు ఉభయసభల్లోనూ ఆమోదం లభించింది. పలు పార్టీలు వ్యతిరేకంగా, కొన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.

  రాష్ట్రపతి భవన్ (ఫైల్ ఫొటో)
  రాష్ట్రపతి భవన్ (ఫైల్ ఫొటో)


  ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో.. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు చట్టపరంగా అమల్లోకి వచ్చినట్టైంది. దీనిపై కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.

  gazette on ebc
  గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం


   

  గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం
  గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం


  ఇక, రూ. 8లక్షల లోపు వార్షికాదాయం ఉన్న అగ్రవర్ణ పేదలు ఈబీసీ కోటాకు అర్హులు. అంతేకాదు 5 ఎకరాల లోపు మాత్రమే వ్యవసాయ భూమి ఉండాలి. 1000 చ.అడుగులు లోపే ఇల్లు ఉండాలి. రెసిడెన్షియల్ ప్లాట్ (మున్సిపాలిటీ) 109 చదరపు గజాల లోపు ఉండాలి. అదే నాన్ మున్సిపాలిటీ ప్రాంతాల్లో 209 చదరపు గజాల్లోపు ఉందాలి. అలాంటి అగ్రవర్ణ పేద ప్రజలకు మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది.
  First published: